News September 5, 2025

యంగ్ సెన్సేషన్.. వన్డేల్లో చరిత్ర సృష్టించాడు

image

సౌతాఫ్రికా యంగ్ క్రికెటర్ మాథ్యూ బ్రిట్జ్‌కే వన్డేల్లో చరిత్ర సృష్టించారు. తొలి ఐదు వన్డే మ్యాచ్‌లలో 50+ స్కోర్స్ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 85 రన్స్ చేసిన బ్రిట్జ్‌కే ఈ ఫీట్ సాధించారు. ఈ 26 ఏళ్ల యంగ్ సెన్సేషన్ న్యూజిలాండ్‌తో ఆడిన అరంగేట్ర మ్యాచ్‌లోనే 150 రన్స్‌తో అదరగొట్టారు. ఆ తర్వాత పాక్‌పై 83, AUSపై 57, 88, తాజాగా ENGపై 85 రన్స్ చేశారు.

Similar News

News September 7, 2025

ఎట్టకేలకు మణిపుర్‌కు ప్రధాని మోదీ?

image

ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెల 13 లేదా 14న ఆయన అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది. పీఎం పర్యటనకు సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మణిపుర్ అల్లర్లు చెలరేగినప్పటి నుంచి మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. దీంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News September 7, 2025

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

image

AP: రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. లాయర్ వృత్తిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 42 ఏళ్లకు మించకూడదు. జీతం రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించి <>slprb.ap.gov.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 7, 2025

ఖాళీ కడుపుతోనే పాక్‌పై సెంచరీ చేశా: సెహ్వాగ్

image

టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఆసియా కప్‌కు ముందు పాక్‌తో తలపడిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ‘ఎప్పుడు పాక్‌పై మ్యాచ్ ఓడినా నేను నా టెంపర్‌మెంట్ కోల్పోతాను. 2008 కరాచీలో జరిగిన మ్యాచ్‌లో 300 రన్స్ ఛేజ్ చేయాలి. ఆరోజు నేను ఉపవాసంలో ఉన్నా. నా ఆకలి తీరాలంటే రన్స్ చేయాలనుకున్నా’ అని చెప్పుకొచ్చారు. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ 95 బంతుల్లో 119 రన్స్ చేశారు. టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.