News September 5, 2025

నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

image

AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఢిల్లీలో PM మోదీతో భేటీ కానున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ఆయనకు అందజేస్తారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్నారు. సాయంత్రం విజయవాడ చేరుకుని గురుపూజోత్సవంలో పాల్గొంటారు. కాగా 4 నెలల వ్యవధిలో మోదీని లోకేశ్ రెండోసారి కలవనుండటం గమనార్హం.

Similar News

News September 17, 2025

గాలికుంటు వ్యాధి టీకాలు వేయించారా?

image

AP: పశువుల్లో ప్రమాదకరమైన <<17696053>>గాలికుంటు<<>> వ్యాధి నివారణకు ఈ నెల 15 నుంచి టీకాలు వేస్తున్నారు. వచ్చేనెల 15 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. పాడిరైతులు నిర్లక్ష్యం చేయకుండా పశువులకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.

News September 17, 2025

ప్రధాని మోదీకి ప్రముఖుల శుభాకాంక్షలు

image

PM మోదీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల సంక్షేమం, వికసిత్ భారత్ కోసం మీ సంకల్పం మాకు స్ఫూర్తి’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘రాజకీయాలంటే సేవ అని, అధికారం కాదు త్యాగమని నేర్పిన ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని సంజయ్ అన్నారు. PM మోదీకి ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ LoP రాహుల్ గాంధీ, TG CM రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

News September 17, 2025

కోళ్లలో పుల్లోరం వ్యాధి – లక్షణాలు

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.