News September 5, 2025

KNR: రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా శ్రీవాణి

image

శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం అధిపతిగా, విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా విధులు నిర్వహిస్తున్న డా.కోడూరి శ్రీవాణిని ఉన్నత విద్యా విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె ప్రశంసా పత్రం అందుకోనున్నారు.

Similar News

News September 9, 2025

జగిత్యాల: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజీ

image

CPI మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శిగా JGTL(D)కు చెందిన తిప్పిరి తిరుపతి @ దేవుజీ నియామకమయ్యారు. సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్న దేవుజీని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2025 మే 21న ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో నంబాళ్ల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ చనిపోగా అప్పటినుంచి ఖాళీగా ఉంది.

News September 9, 2025

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 10వ తేదీన జరుగుతాయని జడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఒకటి నుంచి ఏడు వరకు గల స్థాయి సమావేశాలు వేరువేరుగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 10:30 నుంచి జరిగే సమావేశాలకు అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

News September 9, 2025

మాజీ సీఎం కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలి: రాజాసింగ్

image

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్న కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలిస్తే సాగర్‌ను మంచినీటితో నింపవచ్చని సూచించారు.