News September 5, 2025

HYDలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది: హరీశ్

image

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హైడ్రాతో ఎన్నారైలను రేవంత్ భయపెట్టారని, దీంతో వారు పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కూలితే రాద్ధాంతం చేస్తున్నారని లండన్ పర్యటనలో మండిపడ్డారు. ఇప్పటికీ బాగు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. రేవంత్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా BRSదే విజయమన్నారు.

Similar News

News September 8, 2025

బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి: భట్టి

image

TG: ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను ఇవ్వాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘రుణమాఫీ, రైతు భరోసా పేరిట ప్రభుత్వం రైతుల పక్షాన రూ.30వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి. ఆస్తుల తాకట్టు, FDలు చేయండంటూ వారిని ఒత్తిడి చేయొద్దు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి’ అని సూచించారు.

News September 8, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఈ రాత్రికి ఢిల్లీకి TG సీఎం రేవంత్
* యూరియాపై ఏ ఒక్క రైతు ఆందోళన చెందొద్దు: అచ్చెన్న
* గుంటూరు తురకపాలెంలో HYD శ్రీబయోటెక్ శాస్త్రవేత్తల బృందం పర్యటన
* యూరియా కోసం సిద్దిపేటలో రైతుల ఆందోళన.. హైవేపై ట్రాఫిక్ జామ్
* భారత మెన్స్ హాకీ జట్టుకు అభినందనలు: మంత్రి మండిపల్లి
* వరంగల్ (D) మామునూరులో ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్.. TG, AP, బిహార్, ఝార్ఖండ్ NCC విద్యార్థులు హాజరు

News September 8, 2025

మల్లెపూలతో విమానం ఎక్కిన నటికి బిగ్ షాక్

image

బ్యాగులో మల్లెపూలు పెట్టుకొని ఆస్ట్రేలియా వెళ్లిన మలయాళ నటి నవ్య నాయర్‌కు మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్ అధికారులు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఓనం కార్యక్రమంలో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ వెళ్లగా ఎయిర్‌పోర్ట్ చెకింగ్‌లో మల్లెపూలు కనిపించాయి. ఇది బయో సెక్యూరిటీ చట్టాలకు విరుద్ధమంటూ ఫైన్ వేశారు. పండ్లు, పూలు, విత్తనాల రవాణాతో ప్రయాణికులకు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ చట్టాలు రూపొందించారు.