News September 5, 2025
మిస్టరీగానే ప్రకాశం జిల్లా హత్య కేసు.!

ప్రకాశం జిల్లాలో <<17608174>>కాల్చి చంపబడిన బ్రహ్మయ్య హత్య<<>> కేసు మిస్టరీగా మారింది. దర్గా గ్రామానికి చెందిన బ్రహ్మయ్య గురువారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బ్రహ్మయ్య YCP కార్యకర్త కావడంతో నాయకులు రాజకీయ కోణంలో హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. DSP బ్రహ్మయ్య హత్య ఘటనపై స్పందిస్తూ ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్య కాదని మీడియా సమావేశంలో తెలిపారు.
Similar News
News September 6, 2025
ప్రకాశం: 13 మందికి కారుణ్య నియామక పత్రాల పంపిణీ

ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. కారుణ్య నియామక కోటాలో ఉద్యోగం పొందిన 13 మందికి శనివారం ఒంగోలులో ఆమె నియామక పత్రాలను ఇచ్చారు. ఆడిట్, రెవెన్యూ, పరిశ్రమలు, రిజిస్ట్రేషన్, కార్మిక శాఖల్లో వీరికి ఉద్యోగాలు కల్పించారు. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థానానికి చేరుకునేలా విధులు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.
News September 6, 2025
ప్రకాశం: గణేష్ నిమజ్జనోత్సవంలో విషాదం.. ఇద్దరు మృతి

ప్రకాశంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తపట్నం మండలం గుండమాల తీరంలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన భక్తులలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మోటుమాలకు చెందిన కొందరు నిమజ్జోత్సవంలో పాల్గొనేందుకు గుండమాల తీరం వద్దకు వెళ్లారు. గణనాథుడి నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఇద్దరు తీరంలోకి వెళ్లగా.. ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 6, 2025
ప్రకాశం: హిజ్రాలకు గుడ్ న్యూస్.. ఈ శిక్షణ వారికే.!

ప్రకాశం జిల్లాలోని హిజ్రాలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒంగోలులో తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన హిజ్రాలకు జాతీయస్థాయి IT రంగాల్లో నైపుణ్యత పెంచేందుకై ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తులు
ఇవ్వాలన్నారు.