News September 5, 2025
అద్భుతం.. బాలభీముడు పుట్టాడు!

మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో 34 ఏళ్ల మహిళ 5.2 కేజీల మగపిల్లాడికి జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ సాధ్యపడకపోవడంతో సిజేరియన్ చేశామని వైద్యులు తెలిపారు. ఇంత బరువున్న శిశువును చూడటం ఇదే తొలిసారి అని సంబరపడుతూ అతడితో ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫొటోల్లో ఆ పిల్లాడు ఏడాది వయసు ఉన్నవాడిగా కనిపించాడు. సాధారణంగా పిల్లలు 2.5 కేజీల నుంచి 3.2 కేజీల బరువుతో జన్మిస్తారు.
Similar News
News September 7, 2025
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్

భారత్ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో PM మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. US దిగుమతులపై 75% సుంకాలు విధించి ప్రధాని ధైర్యసాహసాలు చూపించాలన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే దేశ ప్రజలు వెన్నంటే ఉంటారని తెలిపారు. అధిక పన్నులు విధించాలని, ఆ తర్వాత ట్రంప్ మనముందు మోకరిల్లుతారో లేదో చూడాలని సూచించారు. అంతేగాని US ముందు మోదీ ఎందుకు మోకరిల్లుతున్నారో అర్థం కావడంలేదన్నారు.
News September 7, 2025
నిమజ్జనంలో విషాదం.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

TG: వినాయకుడి నిమజ్జనం ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ ట్రాఫిక్ PSలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ డేవిడ్(31) నిన్న మల్కాజ్‌గిరిలోని ఇంటికి వెళ్లారు. కాలనీలో గణేశ్ శోభాయాత్రలో డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News September 7, 2025
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే..

నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్-9 మొదలైంది. తొలి కంటెస్టెంట్‌గా తనూజ(ముద్దమందారం) హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆశా/ఫ్లోరా సైనీ(సినీ నటి), కమెడియన్ ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, సామాన్యుల కోటాలో పడాల పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్‌లో రెండు హౌస్‌లు ఉంటాయని నాగార్జున తెలిపారు. సామాన్యులుvsసెలబ్రిటీలుగా షో సాగే అవకాశం ఉంది. ఈ సారి 15 మందికిపైగా కంటెస్టెంట్లు ఉండనున్నట్లు సమాచారం.