News September 5, 2025
NLG: GPOలుగా 276 మంది ఎంపిక

జిల్లాలో గ్రామ పాలన అధికారుల నియామకాలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. జిల్లా నుంచి గ్రామ పాలనాధికారులుగా 276 మంది ఎంపికయ్యారు. వీరికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులోని హైటెక్ సిటీలో నియామక పత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 275 క్లస్టర్లలో వీరు నియామకం కానున్నారు. ఇవాళ కానీ రేపు గాని కలెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు.
Similar News
News September 8, 2025
NLG: సీసీటీవీ ఇన్స్టాలేషన్, సర్వీస్‌లో ఉచిత శిక్షణ

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు CCTV ఇన్స్టాలేషన్, సర్వీస్‌లో 13 రోజుల ఉచిత శిక్షణ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి సోమవారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుండి 45 లోపు ఉమ్మడి జిల్లా వారు అర్హులని,ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని 7032415062 సంప్రదించాలన్నారు.
News September 8, 2025
నేడు గ్రీవెన్స్ డే రద్దు: ఎస్పీ

నేడు (సోమవారం) నిర్వహించాల్సిన గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆయన అందుబాటులో ఉండని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని తెలిపారు.
News September 7, 2025
రేపటి నుంచి నల్గొండలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్..!

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 8 నుంచి NLG పట్టణంలోని మైసయ్య విగ్రహం సమీపంలో అన్నపూర్ణ క్యాంటీన్ ఆవరణలో మెప్మా, పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. మెప్మా ద్వారా ఉపాధి పొందుతున్న మహిళల ఆధ్వర్యంలో వివిధ రకాల వంటల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.