News September 5, 2025
మెదక్: ప్రేమ పెళ్లి వద్దన్నందుకు యువతి సూసైడ్ (UPDATE)

ప్రేమ విఫలం కావడంతో <<17611907>>యువతి సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. శివ్వంపేట మం. తాళ్లపల్లి తండాకు చెందిన సక్కుబాయి(21) గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతోంది. నారాయణఖేడ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. వరసకు అన్న అవుతాడని పెళ్లి వద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఈనెల 1న పురుగు మందు తాగింది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News September 7, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాల్లో మార్పులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ స్టేషన్లలో కొన్నింటిని మార్చారు. బోరబండ ఎన్ఆర్ఆర్‌పురంలోని రెండు అదనపు బూత్‌లను సాయిబాబానగర్ ప్రభుత్వ స్కూల్‌కు మార్చారు. ఎల్లారెడ్డిగూడ రేడియంట్ స్కూల్లోని అదనపు కేంద్రాన్ని పడాల రామిరెడ్డి లా కాలేజీలోకి మార్చారు. అమానత్ పాఠశాలలో అదనపు బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆనంద్ విద్యాలయ కిడ్స్ స్కూల్, యూసఫ్‌గూడ వార్డు కార్యాలయంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News September 7, 2025
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్

భారత్ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో PM మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. US దిగుమతులపై 75% సుంకాలు విధించి ప్రధాని ధైర్యసాహసాలు చూపించాలన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే దేశ ప్రజలు వెన్నంటే ఉంటారని తెలిపారు. అధిక పన్నులు విధించాలని, ఆ తర్వాత ట్రంప్ మనముందు మోకరిల్లుతారో లేదో చూడాలని సూచించారు. అంతేగాని US ముందు మోదీ ఎందుకు మోకరిల్లుతున్నారో అర్థం కావడంలేదన్నారు.
News September 7, 2025
HPCLలో అగ్నిప్రమాదంపై స్పందించిన హోంమంత్రి అనిత

విశాఖలోని ఈస్ట్ ఇండియా పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పిడుగు పడిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి అనిత అగ్నిమాపకశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని పేర్కొన్నారు.