News September 5, 2025

కృష్ణా: యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

image

కృష్ణా జిల్లాలో యూరియా సరఫరాపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. యూరియా ఇతర అవసరాలకు మళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. PACSల ద్వారా మాత్రమే రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ నిరంతరం PACSలను సందర్శిస్తూ సరఫరా తీరును పర్యవేక్షిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఇతర జిల్లాల నుంచి 500 టన్నుల యూరియాను జిల్లాకు రప్పించారు.

Similar News

News October 24, 2025

కృష్ణా జిల్లా DMHOగా బాధ్యతలు స్వీకరించిన డా. యుగంధర్

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(DMHO)గా డా. యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. DMHOగా బాధ్యతలు నిర్వర్తించిన డా. శర్మిష్ట గత నెల పదవీ విరమణ చేయగా ఆమె స్థానంలో యుగంధర్ నియమితులయ్యారు. ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడైన యుగంధర్ గతంలో గుడివాడ, అవనిగడ్డలో పని చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా కూడా పని చేశారు. నూతన DMHOను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.

News October 24, 2025

డిజిటల్ ట్రేసబులిటీతో రైతులకు లాభాలు: కలెక్టర్

image

నూతన వ్యవసాయ విధానం వలన పెట్టుబడి వ్యయం, విద్యుత్ ఛార్జీల వ్యయం గణనీయంగా తగ్గుతుందని
కలెక్టర్ బాలాజీ అన్నారు. సకాలంలో పంట కోతను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. అలాగే, డిజిటల్ ట్రేసబులిటీ ద్వారా రైతులు తమ పంట వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చని, దీనివల్ల బ్యాంకులు రుణాలు మంజూరు చేయడమే కాక భీమా కంపెనీలు కూడా భీమా సదుపాయాలు అందిస్తున్నాయని కలెక్టర్ వివరించారు.

News October 23, 2025

ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో కొన్నిచోట్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద తగిన గోదాములు, తూకం యంత్రాలు, తడి ధాన్యం ఆరబెట్టే వసతులు, రైతులకు తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.