News September 5, 2025
యుద్ధప్రాతిపాదికన ఎస్టీపీల పనులు ప్రారంభించాలి: ఎండీ

దసరాలోపు కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులు ప్రారంభించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. నూతనంగా అమృత్- 2.0 పథకంలో భాగంగా నిర్మించే 39 ఎస్టీపీల నిర్మాణంపై జలమండలి కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్యాకేజీ- 2 కింద నిర్మించనున్న 39 ఎస్టీపీల పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణానికి ప్లాన్లను వెంటనే ఖరారు చేయాలన్నారు.
Similar News
News September 7, 2025
HYD: మైనర్ బాలికపై అత్యాచారం

మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సిటీ శివారులో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. శనివారం రాత్రి యాచారం మం. పరిధిలోని ఓ గ్రామంలో బాలికకు మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు. ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. మరొకడు అత్యాచారానికి యత్నించాడు. ఆదివారం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం సిటీలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
News September 7, 2025
ఘట్‌కేసర్: జులూస్‌లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ డేవిడ్ గుండెపోటుతో మృతిచెందాడు. నిన్న విధులు ముగించుకొని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్ విష్ణుపురి కాలనీలోని ఇంటికి వెళ్లాడు. సాయంత్రం వినాయకుడి ఊరేగింపులో డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ఉదయం 4 గంటలకు అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
News September 7, 2025
పండగ రద్దీ తగ్గించేందుకు ఇతర స్టేషన్లకు రైళ్ల మళ్లింపు

దసరా, దీపావళి పండగల కోసం సొంతూరికి వెళ్లేందుకు ప్రయాణికులు సెప్టెంబర్ నుంచే సికింద్రాబాద్ స్టేషన్‌కు క్యూ కడతారు. అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించనున్నారు. సనత్‌నగర్, చర్లపల్లి, అమ్ముగూడ, మౌలాలి స్టేషన్లకు మళ్లించాలని నిర్ణయించారు. పండగ రద్దీ కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిటీ పోలీస్, ఆర్టీసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు.