News September 5, 2025

ప్రధానితో సమావేశమైన నారా లోకేశ్

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘యోగాంధ్ర టేబుల్ బుక్‌’ను PM ఆవిష్కరించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాజకీయ పరిస్థితులపై మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని టైట్ షెడ్యూల్‌ మధ్య ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత కేంద్ర మంత్రులను లోకేశ్ కలవనున్నారు.

Similar News

News February 18, 2026

తన అనారోగ్య సమస్యను వివరించిన మమ్ముట్టి

image

గతేడాది తాను జ్ఞానేంద్రియాల సమస్య ఎదుర్కొన్నట్లు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వెల్లడించారు. ‘విన్పించడం, వాసన గుర్తించడం లాంటివి చాలాకాలం తెలియలేదు. నడిచేందుకూ ఇబ్బంది పడ్డా. చికిత్సతో పూర్తిగా కోలుకుంటున్నా’ అని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. మనిషికి జ్ఞానేంద్రియాలు గొప్ప వరమని, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కాగా 2025లో షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకోవడంతో క్యాన్సర్ అని రూమర్స్ వచ్చాయి.

News February 18, 2026

అభిని పక్కనబెట్టి సంజూను తీసుకోవాలని డిమాండ్లు

image

అభిషేక్ శర్మ గత 7 అంతర్జాతీయ టీ20ల్లో 5 సార్లు (ఈ WCలో 3 సార్లు) డకౌట్ కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి మెగా టోర్నీల్లో ఇంత నిర్లక్ష్యంగా ఆడటం ఏంటని టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కీలకమైన సూపర్-8లో అభిని పక్కనబెట్టి సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News February 18, 2026

సర్వంAI.. ఈసారి జెమినీ ఫ్లాష్, డీప్‌సీక్‌కు పోటీగా

image

ఇటీవల <<19088829>>అక్యూరసీలో<<>> చాట్‌జీపీటీ, జెమినీని బీట్ చేసిన సర్వంAI తాజాగా రెండు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) రిలీజ్ చేసింది. 30B, 105B అనే మోడల్స్ బడా ఏఐ మోడల్స్‌కు దీటుగా పనిచేస్తాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా 105B LLM జెమినీ 2.5 ఫ్లాష్, చైనాకు చెందిన డీప్‌సీక్ R1 మోడల్స్ కంటే సమర్థంగా పనిచేస్తుందని పేర్కొంది. నిర్వహణ ఖర్చు కూడా వాటితో పోలిస్తే తక్కువేనని తెలిపింది.