News September 5, 2025

NLR: హూజ్ యాప్‌తో రూ.2 కోట్లకు టోకరా..?

image

కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ప్రజల ఆశను కొందరు ఆసరాగా చేసుకొని భారీగా కొల్లగొడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో హూజ్ యాప్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. 2024లోనే ఈ యాప్ ప్రారంభమైంది. జిల్లాలో దాదాపు రూ.2కోట్లకు పైగా నగదు డిపాజిట్ చేయించుకుంది. ఈ యాప్‌లో చేరిన వారికి గత నెల 20వ తేదీ నుంచి నగదు ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు వాపోయారు.

Similar News

News November 6, 2025

లోకేష్ పర్యటనలో టోల్ గేట్ వరకే పరిమితమైన కావలి MLA !

image

మంత్రి నారా లోకేష్ కావలి నియోజకవర్గ పర్యటనలో MLA కృష్ణారెడ్డి పాత్ర కేవలం ముసునూరు టోల్ గేట్ వరకు మాత్రమే పరిమితమైంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ వెంట MLA దగదర్తికి వెళ్లలేదు. MLA కావ్యకు టీడీపీ నేత మాలేపాటికి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. కావ్య రాకను మాలేపాటి అనుచరులు, అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఆయన టోల్ గేట్ వరకే పరిమితమయ్యారని సమాచారం.

News November 6, 2025

మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

image

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.

News November 6, 2025

నెల్లూరు యువకుడిని మోసం చేసిన యువతులు

image

నెల్లూరు సిటీకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా పూర్వ, లావణ్య పరిచయమయ్యారు. పూర్వ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.2లక్షలు పెట్టించింది. లావణ్య సైతం ట్రేడింగ్‌లో పలుదఫాలుగా రూ.10లక్షలు ఇన్వెస్ట్ చేయించింది. ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి రూ.54వేలు కట్టాలని లావణ్య కోరింది. మోసపోయానని గ్రహించిన యువకుడు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.