News April 3, 2024

తిరుపతి: ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అంజయ్య

image

తిరుపతిలో ఇండియా కూటమి పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ అంజయ్య పోటీ చేయనున్నట్లు బుధవారం స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు తనకు ఒక అవకాశం ఇస్తే పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామన్నారు.

Similar News

News January 16, 2026

చిత్తూరు: గొర్రెల మందపై చిరుత దాడి!

image

పులిచెర్ల మండలం పాలెం పంచాయతీ సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందగా మరొక గొర్రెకు తీవ్ర గాయాలయ్యాయి. పాల్యంకు చెందిన కృష్ణయ్య తన 40 గొర్రెలను శుక్రవారం అడవుల్లోకి తోలుకెళ్లాడు. సాయంత్రం చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందిందని, మరొక గొర్రెకు గాయాలయ్యాయన్నారు. ఇంకో గొర్రె అదృశ్యమైనట్లు గుర్తించామని రైతు తెలిపారు.

News January 16, 2026

CTR: మామిడి రైతులకు బకాయిలు అందేనా.?

image

మామిడి రైతులకు పల్ప్ ఫ్యాక్టరీలు అందించాల్సిన బకాయిలు ఇంతవరకు అందకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో సీజన్ ప్రారంభానికి సిద్ధమైనా ఇంతవరకు ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించడం లేదు. రూ.50 కోట్ల వరకు బకాయిలు రైతులకు ఫ్యాక్టరీలు అందించాల్సి ఉంది. గత సీజన్లో ప్రభుత్వం కిలో తోతాపూరికి రూ.4 రాయితీ చెల్లించగా.. ఫ్యాక్టరీలు రూ.8 చెల్లించాలని ఆదేశించింది.

News January 16, 2026

చిత్తూరులో జనాభా లెక్కలు ఎప్పటి నుంచో తెలుసా?

image

చిత్తూరు జిల్లాలో జన గణననకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. కలెక్టర్ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి తాను ముఖ్య జన గణన అధికారిగా ఉంటానని వెల్లడించారు. ఇతర శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో సుమారు ఆరు లక్షల గృహాలు ఉండగా.. 2011 లెక్కల ప్రకారం18 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఏప్రిల్ ఒకటి నుంచి జన గణన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.