News September 5, 2025
నరసన్నపేట: మిస్సైన బంగారం వ్యాపారి మృతదేహం లభ్యం

నరసన్నపేటలో గతనెల 26న మిసైన బంగారం వ్యాపారి పి పార్వతీశ్వర గుప్త మృతదేహం ఎట్టకేలకు లభ్యమయింది. శుక్రవారం నరసన్నపేట పోలీసులు మిస్సింగ్ కేసును ఛేదించేందుకు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా శ్రీకాకుళం పెద్దపాడు వద్ద రామిరెడ్డి గెడ్డలో మృతదేహం లభ్యం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. పథకం ప్రకారం హత్య చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News September 6, 2025
శ్రీకాకుళం: ప్రయాణికులకు అలర్ట్

పెందుర్తి – సింహాచలం లైన్ మధ్య జరిగే సాంకేతిక పనులు కారణంగా నేటి నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈనెల 6, 8, 10, 12వ తేదీల్లో విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18526) & 7, 9, 11, 13వ తేదీల్లో బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (19525)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 6, 2025
శ్రీకాకుళం: మాస్టార్లు మీకు వందనాలు

భావితరాలను సన్మార్గంలో నడిపించేది గురువే. వీరిని స్మరించుకునేందుకు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతినే నేడు ఉపాధ్యాయు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఉత్తమంగా విద్యనందించిన 60 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసి ఇవాళ కలెక్టర్ పురస్కారాలను ఇచ్చారు. స్టూడెంట్స్ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసిన ప్రైవేటు, ప్రభుత్వ టీచర్లకు మరోసారి గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు.
News September 6, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

☛ ఆమదాలవలసలో వివాహిత సూసైడ్
☛రణస్థలం: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి
☛టెక్కలి: నిర్లక్ష్యం.. నేడు శాపం అవుతోందా?
☛పలాస: ఆటో ఢీకొని యువకుడు మృతి
☛ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రాముఖ్యమైనది: కలెక్టర్
☛మందస: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు
☛నరసన్నపేట: బంగారం వ్యాపారి మృతదేహం లభ్యం
☛గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే కూన రవి కుమార్