News September 5, 2025
పులివెందులకు ఉపఎన్నిక ఖాయం: రఘురామ

AP: ఈసారి వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్‌క్వాలిఫై అవుతారని, పులివెందులకు ఉపఎన్నిక ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఓ MLA 60 రోజులపాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని ఆయన తెలిపారు. ‘మాజీ CM అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుతున్నా. ప్రతిపక్ష హోదా కోసం ఆయన చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు.
Similar News
News September 8, 2025
మూసీని ప్రక్షాళన చేయొద్దా: రేవంత్

TG: గంగా, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు కానీ తాము మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా అని సీఎం <<17649892>>రేవంత్<<>> రెడ్డి ప్రశ్నించారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. ఇందుకు అందరూ కలిసి రావాలని కోరుతున్నా. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది’ అని స్పష్టం చేశారు.
News September 8, 2025
ఈ సూపర్ కాప్ గురించి తెలుసా?

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్‌ను రెండు సార్లు పట్టుకున్న ముంబై లెజెండరీ పోలీస్ మధుకర్ బాపూరావు జెండే గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తన తెలివితేటలు, ధైర్యం, ఓపికతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించడం విశేషం. దీంతో ఆనాటి పీఎం రాజీవ్ గాంధీ స్వయంగా వచ్చి జెండేను ప్రశంసించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ సినిమా ఈనెల 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
News September 8, 2025
TTD ఈవోగా మరోసారి సింఘాల్.. ఆయన గురించి తెలుసా?

AP: 2017-20 మధ్య TTD EOగా పని చేసిన IAS అధికారి అనిల్ కుమార్ <<17648825>>సింఘాల్<<>> మరోసారి అక్కడికే బదిలీ అయ్యారు. గతంలో ఆయన తిరుమలలో టైమ్ స్లాట్ దర్శన, టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీవాణి ట్రస్ట్‌కు రూపకల్పన చేసి అమలు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా TTD ఖజానాకు నెలకు రూ.450 కోట్ల ఆదాయం వస్తోంది. TTDలో అన్యమత ఉద్యోగుల గుర్తింపు కోసం సర్వే చేశారు. 2020లో వైసీపీ ప్రభుత్వం సింఘాల్‌ను ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది.