News September 5, 2025
శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కోఠారి నుంచి రూ.60కోట్లు తీసుకొని మోసం చేశారన్న అభియోగాలపై వీరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు వీరి ట్రావెల్ లాగ్‌లను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక నేరాల విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో దంపతులు దేశం వదిలి వెళ్లకుండా నోటీసులిచ్చారు.
Similar News
News September 8, 2025
ఈ సూపర్ కాప్ గురించి తెలుసా?

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్‌ను రెండు సార్లు పట్టుకున్న ముంబై లెజెండరీ పోలీస్ మధుకర్ బాపూరావు జెండే గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తన తెలివితేటలు, ధైర్యం, ఓపికతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించడం విశేషం. దీంతో ఆనాటి పీఎం రాజీవ్ గాంధీ స్వయంగా వచ్చి జెండేను ప్రశంసించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ సినిమా ఈనెల 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
News September 8, 2025
TTD ఈవోగా మరోసారి సింఘాల్.. ఆయన గురించి తెలుసా?

AP: 2017-20 మధ్య TTD EOగా పని చేసిన IAS అధికారి అనిల్ కుమార్ <<17648825>>సింఘాల్<<>> మరోసారి అక్కడికే బదిలీ అయ్యారు. గతంలో ఆయన తిరుమలలో టైమ్ స్లాట్ దర్శన, టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీవాణి ట్రస్ట్‌కు రూపకల్పన చేసి అమలు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా TTD ఖజానాకు నెలకు రూ.450 కోట్ల ఆదాయం వస్తోంది. TTDలో అన్యమత ఉద్యోగుల గుర్తింపు కోసం సర్వే చేశారు. 2020లో వైసీపీ ప్రభుత్వం సింఘాల్‌ను ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది.
News September 8, 2025
నేడే లాస్ట్.. రూ.1.26 లక్షల జీతంతో ఉద్యోగాలు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో 841 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 410 AAO (స్పెషలిస్ట్), 350 AAO (జనరలిస్ట్), 81 ఏఈ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి అర్హత కలిగి ఉండాలి. వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.88,635 నుంచి రూ.1.26 లక్షల వరకు ఉంటుంది. <