News September 5, 2025

9న ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసన: వైసీపీ

image

రైతులకు సరిపడా యూరియా అందించడంలో విఫలమైన ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 9న ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వంలో గ్రామాల వారీగా రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ చేస్తే కూటమి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసిన ఘనత బాబుదే అన్నారు.

Similar News

News September 6, 2025

కరీంనగర్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డా.కాంపల్లి అర్జున్

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYDలోని శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహించింది. ఈ మేరకు KNRలోని SRR ప్రభుత్వ కళాశాలలో వాణిజ్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డా.కాంపల్లి అర్జున్ తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకున్నారు. అర్జున్ మాట్లాడుతూ.. ఈ అవార్డు ఉపాధ్యాయుడి కృషికి రాష్ట్రం ఇచ్చిన గౌరవమన్నారు.

News September 6, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

☛ ఆమదాలవలసలో వివాహిత సూసైడ్
☛రణస్థలం: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి
☛టెక్కలి: నిర్లక్ష్యం.. నేడు శాపం అవుతోందా?
☛పలాస: ఆటో ఢీకొని యువకుడు మృతి
☛ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రాముఖ్యమైనది: కలెక్టర్
☛మందస: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు
☛నరసన్నపేట: బంగారం వ్యాపారి మృతదేహం లభ్యం
☛గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే కూన రవి కుమార్

News September 6, 2025

ఇబ్రహీంపట్నం: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులిగా శోభారాణి

image

ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు ఎంపీహెచ్ఎస్ ఇంగ్లిష్ టీచర్ సీహెచ్.శోభారాణి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులిగా ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రాము శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 7న కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో ఆమె జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును స్వీకరించనున్నారు. ఆమెను పలువురు అభినందించారు.