News September 5, 2025

IBలో 455 ఉద్యోగాలు

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 455 సెక్యూరిటీ అసిస్టెంట్(మోటార్ ట్రాన్స్‌పోర్ట్) ఉద్యోగాలకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, ఒక ఏడాది అనుభవం, మోటార్ మెకానిజం పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. 18-27ఏళ్ల వయసుండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, డ్రైవింగ్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
వెబ్‌సైట్: https://www.ncs.gov.in/

Similar News

News September 6, 2025

అమెరికాకు భారత్ తలవంచుతుంది: ట్రంప్ సలహాదారు

image

ట్రంప్ సలహాదారు హోవర్డ్ లుత్నిక్ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌ వ్యవహారంలో అగ్రరాజ్యం ముందు ఇండియా తలవంచుతుందన్నారు. అమెరికాకు ‘సారీ’ చెప్పి అధ్యక్షుడు ట్రంప్‌తో డీల్ కుదుర్చుకుంటుందని అహంకారపూరిత కామెంట్స్ చేశారు. US మార్కెట్ లేకుండా IND ఆర్థికంగా వృద్ధి చెందలేదన్నారు. ‘ఒకటి, రెండు నెలల్లో USతో చర్చలకు భారత్ దిగొస్తుంది. మోదీతో ఎలా డీల్ చేసుకోవాలో ట్రంప్‌కు తెలుసు’ అని హోవర్డ్ అన్నారు.

News September 6, 2025

కాళేశ్వరంపై ప్రధానిని కలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

image

TG: కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ వేగవంతం చేసేందుకు సీఎంతో కలిసి ప్రధానిని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారవుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని బీజేపీ అగ్రనేతలు కూడా విమర్శించారని గుర్తుచేశారు. సీబీఐ విచారణకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు.

News September 5, 2025

ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

image

సినిమా టికెట్లకు విధించే GSTపై ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేశారు. ‘జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నా. 5 శాతం జీఎస్టీని రూ.100 టికెట్లలోపు కాకుండా రూ.250 టికెట్లకు పెడితే మరింత మేలు జరుగుతుంది. ఇది మధ్య తరగతి ప్రజలు థియేటర్లకు వచ్చేందుకు ఎంతో సహకరిస్తుంది’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రూ.100 టికెట్లపై 12 శాతం GSTని తొలగించి 5 శాతం జీఎస్టీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.