News September 5, 2025

కర్నూలు: ఆయన.. ఓ టీచర్‌, నటుడు, డైలాగ్‌ రైటర్‌, టీ స్టాల్ మాస్టర్‌

image

వెల్దుర్తిలో మేనమామ ఇంట్లో ఉంటున్న దేవనకొండ(M) జిల్లెడుబుడకల గ్రామానికి చెందిన దివాన్‌ జీవన పోరాటం అందరికీ ఆదర్శంగా మారుతోంది. ఉదయం ప్రైవేట్ జూనియర్‌ కళాశాలలో అకౌంట్స్‌ లెక్చరర్‌గా, సాయంత్రం టీ స్టాల్‌లో మాస్టర్‌గా పనిచేస్తున్నారు. సినిమాలపై ఆసక్తితో ‘వెంకీ మామ, బడుగు జీవులు, యువచైతన్యం’ చిత్రాల్లో నటించారు. ‘రక్తచరిత్ర-3, ఉంటే ఇలాగే ఉండాలి’ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేస్తున్నారు.

Similar News

News September 6, 2025

ADB రిమ్స్‌లో ఉపాధ్యాయ దినోత్సవం

image

ఆదిలాబాద్ రిమ్స్‌లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. రిమ్స్‌లో వైద్య విద్య చదువుతున్న 2021 విద్యార్థులు.. వైద్యులను ఆడిటోరియంలో సత్కరించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సైతం వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌లు దీపక్ పుష్కర్, నరేందర్ బండారి, వైద్యులు సందీప్ జాదవ్, తిప్పే స్వామి, సరోజ, అవినాష్‌రెడ్డి ఉన్నారు

News September 5, 2025

ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

image

సినిమా టికెట్లకు విధించే GSTపై ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేశారు. ‘జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నా. 5 శాతం జీఎస్టీని రూ.100 టికెట్లలోపు కాకుండా రూ.250 టికెట్లకు పెడితే మరింత మేలు జరుగుతుంది. ఇది మధ్య తరగతి ప్రజలు థియేటర్లకు వచ్చేందుకు ఎంతో సహకరిస్తుంది’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రూ.100 టికెట్లపై 12 శాతం GSTని తొలగించి 5 శాతం జీఎస్టీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

News September 5, 2025

సిరిసిల్ల: మానవత్వం చాటిన రిజర్వ్ ఇన్‌స్పెక్టర్

image

సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ మానవత్వం చాటుకున్నారు. వెంకట్రావుపల్లిలో ఎల్లారెడ్డిపేటకు చెందిన తల్లి కొడుకు బైక్ అదుపుతప్పి పడిపోయారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్తున్న రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ అది గమనించి వారి వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మధ్యలో అంబులెన్స్ రావడంతో అంబులెన్స్‌లో ఎక్కించారు. మానవత్వం చాటుకున్న ఆయనను పలువురు అభినందించారు.