News September 5, 2025
45 మంది రైతుల నుంచి కాల్స్ స్వీకరించిన కలెక్టర్

ఎన్టీఆర్ కలెక్టర్ డా.లక్ష్మీశా శుక్రవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా 45 మంది రైతులతో మాట్లాడారు. ఎరువుల సరఫరా, వినియోగంపై రైతుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. విడతల వారీగా యూరియా వినియోగం, అధిక దిగుబడులు, నేల సారానికి రక్షణ కలిగించే నానో యూరియా వినియోగంపై రైతులకు మార్గదర్శనం చేశారు. జిల్లాలో యూరియాకు ఎక్కడా కొరత లేదని వదంతులను నమ్మవద్దని కలెక్టర్ సూచించారు.
Similar News
News September 6, 2025
కొండగట్టు: సెప్టెంబర్ 7న ఆలయం మూసివేత

ఈనెల 7న (ఆదివారం) రాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్ని ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం సెప్టెంబర్ 8న (సోమవారం) పుణ్యహవచనం, సంప్రోక్షణ, తిరుమంజనం, ఆరాధన, ఉదయం 7 గంటల నుంచి యధావిధిగా భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు ప్రారంభమవనున్నాయన్నారు.
News September 6, 2025
కోఠి: 49 ఏళ్లుగా పూజలందుకుంటున్న గణనాథుడు

49 ఏళ్లుగా నిర్విరామంగా భక్తుల పూజలందుకుంటున్నాడు కోఠి ఇసామియా బజార్‌లో కొలువైన ఈ 18 అడుగుల భారీ గణనాథుడు. 1976లో చిన్న ప్రతిమతో ప్రారంభమైన ప్రతిష్ఠ ఏటా పెరుగుతూ వస్తుందని శ్రీ గణేశ్ యూత్ అసోసియేషన్ మెంబర్ రాహుల్ తెలిపారు. ఇక గణపయ్యకు నివేదించే లడ్డూను ఏళ్లుగా ఎలాంటి వేలం వేయకుండా స్థానికులకు ఉచితంగా పంచుతున్నట్లు చెప్పారు. స్పెషల్ బ్యాండ్‌తో రేపు సాగర్‌లో వినాయక నిమజ్జనం ఉంటుందని పేర్కొన్నారు.
News September 6, 2025
కరీంనగర్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డా.కాంపల్లి అర్జున్

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYDలోని శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహించింది. ఈ మేరకు KNRలోని SRR ప్రభుత్వ కళాశాలలో వాణిజ్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డా.కాంపల్లి అర్జున్ తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకున్నారు. అర్జున్ మాట్లాడుతూ.. ఈ అవార్డు ఉపాధ్యాయుడి కృషికి రాష్ట్రం ఇచ్చిన గౌరవమన్నారు.