News September 5, 2025
రబీ సీజన్‌కు 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

AP: రబీ సీజన్ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. యూరియా స్టాక్, సప్లై, పంపిణీపై పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో యూరియా కొరత ఉంది. ఆ జిల్లాల్లో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి. యూరియా నిల్వల్లో తేడా లేకుండా చూసుకోవాలి’ అని ఆదేశించారు.
Similar News
News September 6, 2025
బీసీ సంక్షేమశాఖకు స్కోచ్ అవార్డ్

AP: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు వరించింది. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే BC నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందించినందుకుగానూ ఈ పురస్కారం దక్కింది. ఈ నెల 20న ఢిల్లీలో ఈ అవార్డును మంత్రి సవిత అందుకోనున్నారు. కాగా రాష్ట్రంలో BC స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్, టీచర్స్, రైల్వే వంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు శిక్షణ అందించారు.
News September 6, 2025
అమెరికాకు భారత్ తలవంచుతుంది: ట్రంప్ సలహాదారు

ట్రంప్ సలహాదారు హోవర్డ్ లుత్నిక్ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ వ్యవహారంలో అగ్రరాజ్యం ముందు ఇండియా తలవంచుతుందన్నారు. అమెరికాకు ‘సారీ’ చెప్పి అధ్యక్షుడు ట్రంప్‌తో డీల్ కుదుర్చుకుంటుందని అహంకారపూరిత కామెంట్స్ చేశారు. US మార్కెట్ లేకుండా IND ఆర్థికంగా వృద్ధి చెందలేదన్నారు. ‘ఒకటి, రెండు నెలల్లో USతో చర్చలకు భారత్ దిగొస్తుంది. మోదీతో ఎలా డీల్ చేసుకోవాలో ట్రంప్‌కు తెలుసు’ అని హోవర్డ్ అన్నారు.
News September 6, 2025
కాళేశ్వరంపై ప్రధానిని కలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

TG: కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ వేగవంతం చేసేందుకు సీఎంతో కలిసి ప్రధానిని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారవుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని బీజేపీ అగ్రనేతలు కూడా విమర్శించారని గుర్తుచేశారు. సీబీఐ విచారణకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు.