News September 5, 2025
రేపు రాష్ట్రానికి 9,039 మెట్రిక్ టన్నుల యూరియా: తుమ్మల

TG: రాష్ట్రంలోని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉపశమనం కలిగే వార్త చెప్పారు. రేపు రాష్ట్రానికి మరో 9,039 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు తెలిపారు. రానున్న 20 రోజుల్లో 10వేల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. బస్తాల కోసం రైతులు దుకాణాల ముందు రోజులకొద్దీ వేచిచూస్తున్నారు.
Similar News
News September 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(సెప్టెంబర్ 6, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.50 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
✒ ఇష: రాత్రి 7.39 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 6, 2025
BREAKING: రూ.2.3కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

TG: హైదరాబాద్‌లో గణపతి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. రాజేంద్రనగర్ సన్ సిటీలోని రిచ్‌మండ్ విల్లాలో ఏకంగా రూ.2.32కోట్లు పలికింది. ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా హాజరవుతుంటారు. ఈసారి రూ.కోటి నుంచి వేలం మొదలుపెట్టినట్లు సమాచారం.
News September 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.