News September 5, 2025

భైంసా: మోదీ చిత్రపటానికి ఎమ్మెల్యేల పాలాభిషేకం

image

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఇతర వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తూ భైంసాలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Similar News

News September 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 6, 2025

వరల్డ్‌లో ఫస్ట్ ట్రిలియనీర్‌గా మస్క్?

image

బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశముంది. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా భవిష్యత్ నిర్దేశిత లక్ష్యాలు నెరవేరితే CEOగా ఉన్న మస్క్ భారీ ప్యాకేజ్ పొందనున్నారు. ప్రస్తుతం ఆయన $400 బిలియన్లతో ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. రానున్న పదేళ్లలో టెస్లా విలువ $1.1 ట్రిలియన్ల నుంచి $8.5Tకు చేర్చితే మస్క్ $900B ప్యాకేజీ అందుకుంటారు. అదే జరిగితే ఆయన ఆస్తి $1.3T దాటొచ్చు.

News September 6, 2025

ఖమ్మం: సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న MEO

image

నేలకొండపల్లి MEO బాలిన చలపతిరావు ఉత్తమ హెడ్మాస్టర్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఉపాధ్యాయ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఈఓ చలపతిరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.