News April 3, 2024

ఆరోగ్యం కుదుటపడ్డాక వారాహి సభలో పాల్గొంటా: పవన్

image

AP: తాను అస్వస్థతకు గురయ్యాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘అస్వస్థతకు లోనవడం మూలంగా తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర, సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం కుదుటపడిన తరువాత తెనాలి విచ్చేసి వారాహి సభలో పాల్గొంటాను’ అని పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

IPL: ఆ జట్టులోకి సచిన్ కొడుకు!

image

IPL: సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్నట్లు ESPNCricinfo తెలిపింది. ముంబై నుంచి రూ.30 లక్షల ధరకు లక్నోకు వెళ్లారని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని పేర్కొంది. ఇతడిని 2021 వేలంలో రూ.20 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. 2025 వరకు కేవలం 5 మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. IPL కెరీర్‌లో ఈ ఆల్‌రౌండర్ 3 వికెట్లు తీయడంతో పాటు 114 రన్స్ చేశారు.

News November 13, 2025

మహావిష్ణువు పేరును ఎందుకు స్తుతించాలి?

image

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః||
భారతంలో భీష్ముడు, ధర్మరాజుకు ఈ శ్లోకాన్ని చెప్పారు. ‘జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును వేయి నామాలతో స్తుతించిన పురుషుడికి నిత్యం శుభాలు కలుగుతాయి’ అనేది దీనర్థం. నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూ, ఆయన సేవ చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ శ్లోకం వివరిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 13, 2025

ఇండియా A విజయం

image

సౌతాఫ్రికా Aతో జరిగిన తొలి అనధికార వన్డేలో ఇండియా A విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 285 రన్స్ చేసింది. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (117) సెంచరీతో అదరగొట్టారు. తిలక్ వర్మ 39, నితీశ్ 37, అభిషేక్ శర్మ 31 రన్స్ చేశారు.