News September 5, 2025
శివకార్తికేయన్ ‘మదరాసి’ రివ్యూ&రేటింగ్

తమిళనాడులోకి గన్ కల్చర్ రాకుండా అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటమే ‘మదరాసి’. యాక్షన్ సీన్లు, హీరోయిన్‌తో శివకార్తికేయన్ కెమిస్ట్రీ బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నతంగా ఉన్నాయి. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో డైరెక్టర్ మురగదాస్ దారి తప్పారు. కథను కొత్తగా చెప్పడంలో సక్సెస్ కాలేకపోయారు. ఊహించే సీన్లు, సాగదీత విసుగు తెప్పిస్తాయి. అనిరుధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
రేటింగ్: 2.25/5
Similar News
News September 6, 2025
దారుణం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి సూసైడ్

TG: సంగారెడ్డి(D) నిజాంపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కొత్తపల్లి ప్రమీల(23) నిన్న రాత్రి తన ఇద్దరు కుమారులు ధనుశ్(3), సూర్యవంశీ(3 నెలలు)ని గొంతు నులిమి చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కొద్ది రోజుల క్రితమే చిన్న కొడుకును ఊయలలో వేసే కార్యక్రమం పూర్తి చేసి భర్త సంగమేశ్వర్ భార్యా పిల్లలను పుట్టింటికి పంపించారు.
News September 6, 2025
సెప్టెంబర్ 6: చరిత్రలో ఈరోజు

1766: పరమాణు సిద్ధాంత ఆద్యుడు, బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ డాల్టన్ జననం(ఫొటోలో)
1892: నోబెల్ గ్రహీత సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్ జననం
1950: సుప్రసిద్ధ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం
1950: ప్రముఖ కవి, న్యాయవాది ఎన్.బాలకిషన్ రావు జననం
1949: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ జననం
2024: కవి, లిరిక్ రైటర్ వడ్డేపల్లి కృష్ణ మరణం
News September 6, 2025
PHOTOS: ‘SIIMA’లో మెరిసిన తారలు

సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) కార్యక్రమం దుబాయ్‌లో ఘనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీల నుంచి ప్రముఖ హీరోలు, హీరోయిన్స్, నటులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, మీనాక్షి చౌదరి, శ్రియ, నిహారిక, అల్లు శిరీష్, సందీప్ కిషన్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు సందడి చేశారు. వీరి ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.