News September 5, 2025

70 కేసులు వేసినా డీఎస్సీ ఆగలేదు: లోకేశ్

image

AP: ఇప్పుడున్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80% మందిని CM చంద్రబాబే నియమించి ఉంటారని మంత్రి లోకేశ్ అన్నారు. ‘DSC అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే DSC. 13 DSCల ద్వారా 1.80లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. 70 కేసులు వేసినా డీఎస్సీ మాత్రం ఆగలేదు. గత ప్రభుత్వంలో విచిత్రమైన పాలన చూశాం. ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు కాపలా పెట్టారు. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి’ అని లోకేశ్ ధ్వజమెత్తారు.

Similar News

News September 6, 2025

ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు: సుదర్శన్‌రెడ్డి

image

ఇండీ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న బి.సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు. ఆ స్థానంలో కూర్చునే వారికి జడ్జి లక్షణాలు అవసరం. నిష్పక్షపాతం, వివేకం, మాటలు, చేతల్లో న్యాయం ఉండాలి. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. అర్హుల ఓటు హక్కు తొలగించొద్దు’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

News September 6, 2025

దారుణం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి సూసైడ్

image

TG: సంగారెడ్డి(D) నిజాంపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కొత్తపల్లి ప్రమీల(23) నిన్న రాత్రి తన ఇద్దరు కుమారులు ధనుశ్(3), సూర్యవంశీ(3 నెలలు)ని గొంతు నులిమి చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కొద్ది రోజుల క్రితమే చిన్న కొడుకును ఊయలలో వేసే కార్యక్రమం పూర్తి చేసి భర్త సంగమేశ్వర్ భార్యా పిల్లలను పుట్టింటికి పంపించారు.

News September 6, 2025

సెప్టెంబర్ 6: చరిత్రలో ఈరోజు

image

1766: పరమాణు సిద్ధాంత ఆద్యుడు, బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్‌ డాల్టన్ జననం(ఫొటోలో)
1892: నోబెల్ గ్రహీత సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్ జననం
1950: సుప్రసిద్ధ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం
1950: ప్రముఖ కవి, న్యాయవాది ఎన్.బాలకిషన్ రావు జననం
1949: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ జననం
2024: కవి, లిరిక్ రైటర్ వడ్డేపల్లి కృష్ణ మరణం