News September 5, 2025
మెదక్: నిమజ్జనంలో విషాదం.. యువకుడు మృతి

హవేలీఘనపూర్ మండలం తొగిట గ్రామంలో గణేశ్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఓ యువకుడు నీట మునిగి మరణించాడు. గ్రామానికి చెందిన మొండి ప్రభాకర్ కుమారుడు సుధాకర్(17) శుక్రవారం సాయంత్రం రామస్వామి కుంట వద్ద నిమజ్జనం అనంతరం కనిపించకుండా పోయాడు. నిర్వాహకులు, గ్రామస్థులు వెతకగా, అతని మృతదేహం బయటపడింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News September 6, 2025
ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు: సుదర్శన్‌రెడ్డి

ఇండీ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న బి.సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు. ఆ స్థానంలో కూర్చునే వారికి జడ్జి లక్షణాలు అవసరం. నిష్పక్షపాతం, వివేకం, మాటలు, చేతల్లో న్యాయం ఉండాలి. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. అర్హుల ఓటు హక్కు తొలగించొద్దు’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
News September 6, 2025
BHPL: సన్నకారు రైతుకు యూనిట్‌కు రూ.50 వేల రాయితీ

భూపాలపల్లి జిల్లాలో కూరగాయలు సాగు చేసే సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం యూనిట్‌కు రూ.50 వేల రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునీల్ తెలిపారు. టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామంలో పందిరి విధానంలో సాగు చేస్తున్న బోడకాకరను పరిశీలించారు. పందిరి సాగు విధానాలను ప్రోత్సహిస్తూ ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ, సాంకేతిక సహాయం అందుబాటులో ఉంటుందని వివరించారు.
News September 6, 2025
రైతుల పరిస్థితి అగమ్యగోచరం: బొత్స

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గరివిడి వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శుక్రవారం సమావేశం అయ్యారు. విత్తనం నుంచి ఎరువుల వరకు రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తోందన్నారు. యూరియా కొరత పై ఈనెల 9న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి ఆర్డీవోలకు వినతిపత్రాలు అందిస్తామన్నారు.