News September 5, 2025
కామారెడ్డి: 300 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలతో నిఘా

కామారెడ్డిలో గణేశ్ నిమజ్జన, శోభాయాత్రల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. 300 మంది పోలీసులు, 120 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని SP కోరారు.
Similar News
News September 6, 2025
కరీంనగర్: రైస్ మిల్లర్లు మారట్లే..!

ఉమ్మడి KNRలో రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. పెండింగ్ CMR క్లియర్ చేయాలని అధికారులు కోరుతున్నా మిల్లర్లు పట్టించుకోవట్లేదు. PDPLలో 140 రైస్ మిల్లులుండగా 25 మిల్లుల నుంచి 24వేల టన్నుల CMR పెండింగ్లో ఉంది. KNRలో 133 మిల్లులుండగా 22 డీఫాల్టయ్యాయి. వీట్నుంచి రూ.126 కోట్ల విలువచేసే ధాన్యం ప్రభుత్వానికి రావాలి. సివిల్ సప్లై, విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసినా మిల్లర్లు లైట్ తీసుకుంటున్నారు.
News September 6, 2025
ఇసుక డంపింగ్‌లు కొత్తవి.. బిల్లులు మాత్రం పాతవి

కృష్ణా జిల్లాలో 7 చోట్ల అధికారిక ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నప్పటికీ, తోట్లవల్లూరు (M)లో ఇసుక అక్రమాలు భారీగా జరుగుతున్నాయి స్థానికులు ఆరోపించారు. కృష్ణా నది నుంచి తోడిన ఇసుకను రొయ్యూరు, వల్లూరుపాలెంలోని ప్రైవేట్ ప్రాంతాల్లో నిల్వచేశారన్నారు. 2024 నాటి వే బిల్లులు చూపిస్తూ రవాణా చేస్తున్నారని చెప్పారు. ఆర్డర్ ఐడీ, ట్రిప్ నెంబర్, కస్టమర్ పేరు, అడ్రస్ వంటి నకిలీ ఓచర్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
News September 6, 2025
బాలాపూర్ లడ్డూ చరిత్ర తెలుసా?

HYD బాలాపూర్‌లో 1980లో తొలిసారిగా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. రూ.450కి స్థానికుడు కొలను మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. దీంతో ఆ ఏడాది అన్ని పనుల్లోనూ వారికి మంచి జరిగింది. లడ్డూ పొందడం వల్లే కలిసొచ్చిందని భావించిన ఆ ఫ్యామిలీ.. చాలా సార్లు వేలంలో ఆ లడ్డూను దక్కించుకుంది.