News September 5, 2025

జగిత్యాల: KCRను తిట్టడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడు: కొప్పుల

image

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని, KCRను తిట్టడం తప్ప CM రేవంత్ రెడ్డికి వేరే పని లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఈరోజు జగిత్యాలలోని BRS ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో వరద బాధితులకు ఏం చేస్తారో చెప్పకుండా KCRను తిట్టడమేంటని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారన్నారు. విద్యాసాగర్ రావు, దావ వసంత ఉన్నారు.

Similar News

News September 6, 2025

BHPL: సన్నకారు రైతుకు యూనిట్‌కు రూ.50 వేల రాయితీ

image

భూపాలపల్లి జిల్లాలో కూరగాయలు సాగు చేసే సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం యూనిట్‌కు రూ.50 వేల రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునీల్ తెలిపారు. టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామంలో పందిరి విధానంలో సాగు చేస్తున్న బోడకాకరను పరిశీలించారు. పందిరి సాగు విధానాలను ప్రోత్సహిస్తూ ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ, సాంకేతిక సహాయం అందుబాటులో ఉంటుందని వివరించారు.

News September 6, 2025

రైతుల పరిస్థితి అగమ్యగోచరం: బొత్స

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గరివిడి వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శుక్రవారం సమావేశం అయ్యారు. విత్తనం నుంచి ఎరువుల వరకు రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తోందన్నారు. యూరియా కొరత పై ఈనెల 9న రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి ఆర్డీవోలకు వినతిపత్రాలు అందిస్తామన్నారు.

News September 6, 2025

దారుణం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి సూసైడ్

image

TG: సంగారెడ్డి(D) నిజాంపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కొత్తపల్లి ప్రమీల(23) నిన్న రాత్రి తన ఇద్దరు కుమారులు ధనుశ్(3), సూర్యవంశీ(3 నెలలు)ని గొంతు నులిమి చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కొద్ది రోజుల క్రితమే చిన్న కొడుకును ఊయలలో వేసే కార్యక్రమం పూర్తి చేసి భర్త సంగమేశ్వర్ భార్యా పిల్లలను పుట్టింటికి పంపించారు.