News September 5, 2025

ఇలాంటి వారిని అభినందించాల్సిందే❤️

image

రాత్రి వేళల్లో ఎంతో మంది మహిళలను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్న చెన్నైకి చెందిన లేడీ ఆటో డ్రైవర్ రాజీ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె దాదాపు 20 ఏళ్లుగా నగరంలో ఆటో నడుపుతూ వేలాది మంది అభిమానాన్ని పొందారు. మహిళలకు అర్ధరాత్రి ఏ అవసరమొచ్చినా ఆమె ఆటో సిద్ధంగా ఉంటుంది. రాజీ మహిళలకు ఉచితంగా ఆటో నేర్పించడమే కాకుండా పిల్లలు, వృద్ధులు, పేదవారికి ఉచిత ప్రయాణం అందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Similar News

News September 6, 2025

రాష్ట్రంలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలి: మంత్రి

image

TG: రాష్ట్రంలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మండవీయాను కోరినట్లు మంత్రి వాకాటి శ్రీహరి చెప్పారు. గతంలో CM రేవంత్ కూడా దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారన్నారు. TGలోని పలు జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూళ్ల అభివృద్ధి, వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటిస్తానని కేంద్ర మంత్రి చెప్పారని శ్రీహరి వెల్లడించారు.

News September 6, 2025

ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు: సుదర్శన్‌రెడ్డి

image

ఇండీ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న బి.సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు. ఆ స్థానంలో కూర్చునే వారికి జడ్జి లక్షణాలు అవసరం. నిష్పక్షపాతం, వివేకం, మాటలు, చేతల్లో న్యాయం ఉండాలి. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. అర్హుల ఓటు హక్కు తొలగించొద్దు’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

News September 6, 2025

దారుణం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి సూసైడ్

image

TG: సంగారెడ్డి(D) నిజాంపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కొత్తపల్లి ప్రమీల(23) నిన్న రాత్రి తన ఇద్దరు కుమారులు ధనుశ్(3), సూర్యవంశీ(3 నెలలు)ని గొంతు నులిమి చంపేసింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా కొద్ది రోజుల క్రితమే చిన్న కొడుకును ఊయలలో వేసే కార్యక్రమం పూర్తి చేసి భర్త సంగమేశ్వర్ భార్యా పిల్లలను పుట్టింటికి పంపించారు.