News September 5, 2025
గోదావరిఖని: ‘ఆత్మ గౌరవం దెబ్బతింటున్నా నోరు విప్పని ప్రధాని మోదీ’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బరితెగించి మాట్లాడుతున్నా, భారత దేశ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్నా ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని CPM నేత ఎస్.వీరయ్య అన్నారు. గోదావరిఖని శ్రామిక్ భవన్‌లో భారత ప్రయోజనాలపై ట్రంప్ దాడి-భారత ప్రభుత్వ వైఖరిపై శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం,లౌకిక విలువలు, సామరస్య భావనలను కాపాడుకోవడానికి దేశ ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Similar News
News September 6, 2025
గణపతి నిమజ్జనంలో పాల్గొన్న కలెక్టర్ సత్య శారద

వరంగల్ నగరంలోని ఉర్సు రంగసముద్రంలో నిర్వహిస్తున్న నిమజ్జన కార్యక్రమాంలో కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. నగరంలోని నిమజ్జన ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News September 6, 2025
ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు: సుదర్శన్‌రెడ్డి

ఇండీ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న బి.సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు. ఆ స్థానంలో కూర్చునే వారికి జడ్జి లక్షణాలు అవసరం. నిష్పక్షపాతం, వివేకం, మాటలు, చేతల్లో న్యాయం ఉండాలి. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. అర్హుల ఓటు హక్కు తొలగించొద్దు’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
News September 6, 2025
BHPL: సన్నకారు రైతుకు యూనిట్‌కు రూ.50 వేల రాయితీ

భూపాలపల్లి జిల్లాలో కూరగాయలు సాగు చేసే సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం యూనిట్‌కు రూ.50 వేల రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునీల్ తెలిపారు. టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామంలో పందిరి విధానంలో సాగు చేస్తున్న బోడకాకరను పరిశీలించారు. పందిరి సాగు విధానాలను ప్రోత్సహిస్తూ ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ, సాంకేతిక సహాయం అందుబాటులో ఉంటుందని వివరించారు.