News September 5, 2025
నేను నిత్య విద్యార్థిని: చంద్రబాబు

AP: తల్లిదండ్రుల తర్వాత మనం గుర్తు పెట్టుకునేది ఉపాధ్యాయులనే అని CM చంద్రబాబు అన్నారు. ‘నేను కూడా టీచర్ కావాల్సింది. SVUలో లెక్చరర్‌గా చేరాలని వర్సిటీ వీసీ కోరితే MLA అవుతానని చెప్పా. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారు. నేను నిత్య విద్యార్థిని. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటా. లోకేశ్ చదువు గురించి నా భార్యే చూసేది. ఆ క్రెడిట్ ఆవిడదే’ అని తెలిపారు.
Similar News
News September 6, 2025
SIIMA అవార్డ్స్.. విన్నర్స్ వీరే

* బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప-2)
* బెస్ట్ లిరిక్ రైటర్ – రామజోగయ్యశాస్త్రి(చుట్టమల్లే, దేవర)
* బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్(ఫీమేల్) – శిల్పారావు(చుట్టమల్లే, దేవర)
* బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు(దేవర)
* బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ – సందీప్ సరోజ్(కమిటీ కుర్రోళ్లు)
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(ఫీమేల్) – అన్నా బెన్(కల్కి 2898Ad)
News September 6, 2025
రాష్ట్రంలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలి: మంత్రి

TG: రాష్ట్రంలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మండవీయాను కోరినట్లు మంత్రి వాకాటి శ్రీహరి చెప్పారు. గతంలో CM రేవంత్ కూడా దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారన్నారు. TGలోని పలు జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూళ్ల అభివృద్ధి, వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటిస్తానని కేంద్ర మంత్రి చెప్పారని శ్రీహరి వెల్లడించారు.
News September 6, 2025
ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు: సుదర్శన్‌రెడ్డి

ఇండీ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న బి.సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఆఫీస్ రాజకీయ సంస్థ కాదు. ఆ స్థానంలో కూర్చునే వారికి జడ్జి లక్షణాలు అవసరం. నిష్పక్షపాతం, వివేకం, మాటలు, చేతల్లో న్యాయం ఉండాలి. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. అర్హుల ఓటు హక్కు తొలగించొద్దు’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.