News April 3, 2024

చివరి సినిమాకు విజయ్‌కి భారీ రెమ్యునరేషన్?

image

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం విజయ్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రవేశం చేయడంతో అభిమానుల కోసం తన చివరి సినిమాను హెచ్. వినోద్‌తో చేయనున్నారు. అయితే, ఈ సినిమాకి విజయ్ రికార్డు స్థాయిలో రూ.250 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘ది గోట్’ కోసం కూడా ఆయన రూ.200 కోట్లు తీసుకుంటున్నారట.

Similar News

News January 26, 2026

నేషనల్ అవార్డ్ విన్నర్‌తో మోహన్‌లాల్ కొత్త సినిమా

image

రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్ లాల్ తన 367వ సినిమాను ప్రకటించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని ‘శ్రీ గోకులం మూవీస్’ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ‘దృశ్యం 3’తో రాబోతున్న మోహన్ లాల్.. మమ్ముట్టితో కలిసి ‘పేట్రియాట్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజా ప్రాజెక్ట్ ఆపరేషన్ గంగా నేపథ్యంలో సాగే థ్రిల్లర్ అని సమాచారం.

News January 26, 2026

మంత్రులు భేటీ అయితే తప్పేముంది: మహేశ్

image

TG: నలుగురు మంత్రులు అత్యవసరంగా <<18968187>>సమావేశమయ్యారనే<<>> వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు పరిపాలనా అంశంలో మంత్రులు భేటీ అయితే తప్పేమీ లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఈ విషయంగానే సమావేశం నిర్వహించినట్లు భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ విదేశాల నుంచి వచ్చాక హైకమాండ్‌తో చర్చిస్తామని తెలిపారు.

News January 26, 2026

పాక్‌ను ఇండియన్స్ ఉతికి ఆరేస్తారు.. T20 WCపై మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు

image

ప్రస్తుతం T20ల్లో టీమ్ ఇండియా ఫామ్‌ను చూసి ఆడటానికి ఏ జట్టైనా భయపడుతుందని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఇలాంటి బాదుడును తానెప్పుడూ చూడలేదంటూ న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఇండియన్ ప్లేయర్స్ విధ్వంసకర బ్యాటింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాక్ T20 WCకు రాకపోవడమే మంచిదని.. లేదంటే ఉతికి ఆరేస్తారని సరదాగా అన్నారు. కొలంబోలో సిక్స్ కొడితే మద్రాస్‌లో పడుతుందంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.