News September 5, 2025
ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

సినిమా టికెట్లకు విధించే GSTపై ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేశారు. ‘జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నా. 5 శాతం జీఎస్టీని రూ.100 టికెట్లలోపు కాకుండా రూ.250 టికెట్లకు పెడితే మరింత మేలు జరుగుతుంది. ఇది మధ్య తరగతి ప్రజలు థియేటర్లకు వచ్చేందుకు ఎంతో సహకరిస్తుంది’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రూ.100 టికెట్లపై 12 శాతం GSTని తొలగించి 5 శాతం జీఎస్టీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Similar News
News September 6, 2025
పాక్‌పై మే 10న యుద్ధం ముగియలేదు: ఆర్మీ చీఫ్

మాజీ సైనికాధికారి KJN ధిల్లాన్ రచించిన ‘ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్థాన్’ బుక్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మే 10న వార్ ముగిసిందని మీరు అనుకోవచ్చు. కానీ అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున ఆ తర్వాత కూడా కొనసాగింది. యూనిఫామ్‌లో ఉండి చెప్పలేని అంశాలను ఈ బుక్‌లో కవర్ చేశారు’ అని వ్యాఖ్యానించారు.
News September 6, 2025
SIIMA: బెస్ట్ యాక్టర్స్, డైరెక్టర్ వీరే

* బెస్ట్ యాక్టర్(ఫీమేల్)- రష్మిక మందన్నా(పుష్ప-2)
* బెస్ట్ యాక్టర్(ఫీమేల్-క్రిటిక్స్)- మీనాక్షి(లక్కీ భాస్కర్)
* బెస్ట్ డైరెక్టర్(క్రిటిక్స్)- ప్రశాంత్ వర్మ(హనుమాన్)
* బెస్ట్ డెబ్యూటంట్ ప్రొడ్యూసర్- నిహారిక(కమిటీ కుర్రోళ్లు)
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(మేల్)- అమితాబ్ బచ్చన్(కల్కి)
* బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్(మేల్)- కమల్ హాసన్(కల్కి)
* బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడీ రోల్- సత్య(మత్తు వదలరా 2)
News September 6, 2025
SIIMA అవార్డ్స్.. విన్నర్స్ వీరే

* బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప-2)
* బెస్ట్ లిరిక్ రైటర్ – రామజోగయ్యశాస్త్రి(చుట్టమల్లే, దేవర)
* బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్(ఫీమేల్) – శిల్పారావు(చుట్టమల్లే, దేవర)
* బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు(దేవర)
* బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ – సందీప్ సరోజ్(కమిటీ కుర్రోళ్లు)
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(ఫీమేల్) – అన్నా బెన్(కల్కి 2898Ad)