News September 6, 2025

జగిత్యాల: ఎమ్మెల్యే సంజయ్ ఇంటికి ఎమ్మెల్సీ రమణ

image

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటికి ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణ శుక్రవారం వెళ్లారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎడమ కాలు ఇటీవల ఫ్రాక్చర్ కాగా జగిత్యాలలోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు సతీశ్, దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 6, 2025

ఆదోని జిల్లాలో 3 మండలాలు.. మున్సిపాలిటీ?

image

కూటమి ప్రభుత్వం ఆదోని జిల్లా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తోంది. నియోజకవర్గంలో 44 గ్రామాలను 3 మండలాలుగా విభజించారు. 15 గ్రామాలను కలుపుతూ అరేకల్లు మండల కేంద్రంగా, 14 గ్రామాలను కలిపి పెద్దతుంబలం మండల కేంద్రంగా, 11 గ్రామాలను ఆదోని రూరల్ మండలంగా, 4 గ్రామాలను మున్సిపాలిటీలో కలపాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. దీనిపై అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

News September 6, 2025

పాక్‌పై మే 10న యుద్ధం ముగియలేదు: ఆర్మీ చీఫ్

image

మాజీ సైనికాధికారి KJN ధిల్లాన్ రచించిన ‘ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్థాన్’ బుక్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మే 10న వార్ ముగిసిందని మీరు అనుకోవచ్చు. కానీ అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున ఆ తర్వాత కూడా కొనసాగింది. యూనిఫామ్‌లో ఉండి చెప్పలేని అంశాలను ఈ బుక్‌లో కవర్ చేశారు’ అని వ్యాఖ్యానించారు.

News September 6, 2025

SIIMA: బెస్ట్ యాక్టర్స్, డైరెక్టర్ వీరే

image

* బెస్ట్ యాక్టర్(ఫీమేల్)- రష్మిక మందన్నా(పుష్ప-2)
* బెస్ట్ యాక్టర్(ఫీమేల్-క్రిటిక్స్)- మీనాక్షి(లక్కీ భాస్కర్)
* బెస్ట్ డైరెక్టర్(క్రిటిక్స్)- ప్రశాంత్ వర్మ(హనుమాన్)
* బెస్ట్ డెబ్యూటంట్ ప్రొడ్యూసర్- నిహారిక(కమిటీ కుర్రోళ్లు)
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(మేల్)- అమితాబ్ బచ్చన్(కల్కి)
* బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్(మేల్)- కమల్ హాసన్(కల్కి)
* బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడీ రోల్- సత్య(మత్తు వదలరా 2)