News September 6, 2025

జగిత్యాల: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక

image

జగిత్యాల జిల్లా అర్పపల్లి ZPHS పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న జక్కుల రవి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేస్తూ జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము ఉత్తర్వులు జారీ చేశారు. జక్కుల రవి కష్టపడే తత్వం, అంకిత భావంతో విద్యార్థులకు ఆసక్తి కలిగించే విధంగా సాంఘిక శాస్త్రం చాలా సులభంగా బోధిస్తూ ప్రత్యేకత చాటారని తెలిపారు.

Similar News

News September 6, 2025

గోదావరి నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

image

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి 9,00,814 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.20 అడుగులకు చేరిందని, ఎగువ ప్రాంత ప్రవాహాలు తగ్గుముఖం పట్టడంతో నీటి స్థాయి క్రమంగా తగ్గుతుందన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 12,700 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నామని తెలిపారు.

News September 6, 2025

విశాఖ: ఫొటో మార్ఫింగ్ చేసి వేధిస్తున్న యువకుడి అరెస్ట్

image

మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న యువకుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్లు CP శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖకు చెందిన ఓ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్ ద్వారా పంపాడు. ఇన్‌స్టాగ్రామ్‌‌లో న్యూడ్ వీడియో కాల్ చేయాలని వేధించడంతో మహిళ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తులో యువకుడు నంద్యాల (D)కి చెందిన వెల్లపు గురునాథ్‌‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.

News September 6, 2025

మాజీ MLA ప్రసన్న బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

image

కోవూరు మాజీ MLA నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. వైసీపీ అధినేత జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఓ హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి వల్లే హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారంటూ అయనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ప్రసన్న కోర్టును ఆశ్రయించగా.. విచారించిన న్యాయమూర్తి 8కి వాయిదా వేశారు.