News September 6, 2025

ఇబ్రహీంపట్నం: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులిగా శోభారాణి

image

ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు ఎంపీహెచ్ఎస్ ఇంగ్లిష్ టీచర్ సీహెచ్.శోభారాణి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులిగా ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రాము శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 7న కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో ఆమె జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును స్వీకరించనున్నారు. ఆమెను పలువురు అభినందించారు.

Similar News

News September 6, 2025

సీఎం చేతుల మీదుగా అరుణకు ఉత్తమ టీచర్ అవార్డు

image

పామిడిలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న యాదవ్ అరుణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును సీఎం చంద్రబాబు చేతుల మీదగా అందుకున్నారు. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో కలిసి అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఈ అవార్డు ఉపాధ్యాయ వృత్తిపై మరింత బాధ్యత పెంచిందన్నారు.

News September 6, 2025

ఆదోని జిల్లాలో 3 మండలాలు.. మున్సిపాలిటీ?

image

కూటమి ప్రభుత్వం ఆదోని జిల్లా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తోంది. నియోజకవర్గంలో 44 గ్రామాలను 3 మండలాలుగా విభజించారు. 15 గ్రామాలను కలుపుతూ అరేకల్లు మండల కేంద్రంగా, 14 గ్రామాలను కలిపి పెద్దతుంబలం మండల కేంద్రంగా, 11 గ్రామాలను ఆదోని రూరల్ మండలంగా, 4 గ్రామాలను మున్సిపాలిటీలో కలపాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. దీనిపై అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

News September 6, 2025

పాక్‌పై మే 10న యుద్ధం ముగియలేదు: ఆర్మీ చీఫ్

image

మాజీ సైనికాధికారి KJN ధిల్లాన్ రచించిన ‘ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్థాన్’ బుక్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మే 10న వార్ ముగిసిందని మీరు అనుకోవచ్చు. కానీ అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున ఆ తర్వాత కూడా కొనసాగింది. యూనిఫామ్‌లో ఉండి చెప్పలేని అంశాలను ఈ బుక్‌లో కవర్ చేశారు’ అని వ్యాఖ్యానించారు.