News September 6, 2025

కొండగట్టు: సెప్టెంబర్ 7న ఆలయం మూసివేత

image

ఈనెల 7న (ఆదివారం) రాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్ని ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం సెప్టెంబర్ 8న (సోమవారం) పుణ్యహవచనం, సంప్రోక్షణ, తిరుమంజనం, ఆరాధన, ఉదయం 7 గంటల నుంచి యధావిధిగా భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు ప్రారంభమవనున్నాయన్నారు.

Similar News

News September 6, 2025

ఈ కార్ల ధరలు తగ్గాయ్..

image

మారుతి సుజుకీ బ్రెజా కారు ధర ప్రస్తుతం రూ.8.69 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. మొత్తం 45% పన్ను (28% GST+17% CESS) పడుతోంది. కొత్త జీఎస్టీ ప్రకారం 40% ట్యాక్స్ వేయనున్నారు. సెస్ లేకపోవడంతో రూ.30వేల వరకు ఆదా కానున్నాయి. నెక్సాన్ (పెట్రోల్) కారుపై రూ.68వేల నుంచి రూ.1.26 లక్షలు, వ్యాగన్ Rపై రూ.64వేల-రూ.84వేలు, స్విఫ్ట్‌పై రూ.71వేల-రూ.1.06 లక్షలు, i20పై రూ.83వేల-రూ.1.24 లక్షల వరకు సేవ్ కానున్నాయి.

News September 6, 2025

బీచ్ క్రీడా పోటీలు అంబరాన్ని అంటాలి: బాపట్ల కలెక్టర్

image

దక్షిణ భారత స్థాయిలో బీచ్ క్రీడా పోటీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఫ్లడ్ లైట్ల మధ్య వాలీబాల్, కోకో, బాక్సింగ్, ఫెన్సింగ్ వంటి క్రీడా పోటీలు భారీ స్థాయిలో నిర్వహించాలన్నారు.

News September 6, 2025

HYD: ఉత్తమ టీచర్‌గా స్నేహలత

image

మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ తరపున నిర్మాణ రంగంలో HYD NAC టీచర్ స్నేహలతను జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు వరించింది. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జాతీయ ఉత్తమ టీచర్ అవార్డును ఆమెకు అందజేసి అభినందించారు. తనకు ఇంత గొప్ప గౌరవం దక్కటం గర్వంగా ఉందని స్నేహలత తెలిపారు.