News September 6, 2025

HYD: నిమ‘జ్జనం’.. సాగర సంబరం

image

వినాయకచవితి ఉత్సవాల్లో కీలక ఘట్టానికి వేళయింది. ఖైరతాబాద్ మహా గణపతి భారీ శోభాయాత్ర, బాలాపూర్ లడ్డూ వేలం పాట హైలెట్‌గా నిలవనున్నాయి. సిటీలోని భారీ విగ్రహాలు ఊరేగింపుగా గంగఒడికి చేరనున్నాయి. లక్షలాది మంది నిమజ్జనోత్సవానికి తరలిరానున్నారు. వేలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ట్యాంక్‌బండ్ కిటకిటలాడనుంది. సాగర్‌లో సంబరం అంబరాన్ని అంటనుంది.

Similar News

News September 6, 2025

HYD: వారేవా! బుడ్డోడు భక్తితో గణపయ్యను కట్టేశాడు

image

HYDలో గణేశ్ నిమజ్జనంలో 5 ఏళ్ల బాలుడు సందడి చేశాడు. చిన్న గణపయ్యను తాను ఆడుకునే బైక్‌పైనే ట్యాంక్ బండ్‌పైకి తీసుకురావడం అందరినీ ఆకట్టుకుంది. అ బాలుడి భక్తికి అక్కడికి వచ్చిన పర్యాటకులందరూ తన్మయత్వంలో మునిగారు. ‘గణపయ్యను తాళ్లతోనే కాకుండా నీ భక్తితో కట్టేశావ్.. నీకు సకల శుభాలు కలుగుగాక’ అంటూ దీవిస్తున్నారు. అతడితో ఫొటోలు దిగారు. ఈ అబ్బాయి వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

News September 6, 2025

గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులకు సూచనలు

image

HYDలో గణేవ్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా గోషామహల్ ఏసీపీ సుధర్షన్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రోల్‌కాల్ నిర్వహించారు. నిమజ్జన బందోబస్తు విధుల్లో పాల్గొననున్న పోలీసు సిబ్బందికి అధికారులు స్పష్టమైన సూచనలు అందజేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, శాంతి భద్రతల మధ్య నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 6, 2025

హైదరాబాద్ కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం

image

హైదరాబాద్: మరికొద్దిసేపట్లో బాలాపూర్ లడ్డు వేలం పాట ప్రారంభం కానుంది. 1994లో తొలిసారి బాలాపూర్ లడ్డూను వేలం వేశారు. మొదటి ఏడాది రూ.450 వేలం పాట పాడగా, 2002లో 1,05,000 పలికింది. గత ఏడాది లడ్డూ రూ.30,01,000 పలికి రికార్డు సృష్టించింది. ఏటా జరిగే వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలుకగా.. ఈ ఏడాది ఎంత పలుకుతుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.