News September 6, 2025

విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

పెందుర్తి – సింహాచలం లైన్ మధ్య జరిగే సాంకేతిక పనులు కారణంగా నేటి నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈనెల 6, 8, 10, 12వ తేదీల్లో విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18526) & 7, 9, 11, 13వ తేదీల్లో బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (19525)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News September 6, 2025

రైతుల పరిస్థితి అగమ్యగోచరం: బొత్స

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గరివిడి వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శుక్రవారం సమావేశం అయ్యారు. విత్తనం నుంచి ఎరువుల వరకు రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తోందన్నారు. యూరియా కొరత పై ఈనెల 9న రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి ఆర్డీవోలకు వినతిపత్రాలు అందిస్తామన్నారు.

News September 5, 2025

ముస్లింల ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయి: SP

image

విజయనగరం జిల్లాలో ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ పండగ సందర్భంగా జిల్లా కేంద్రంలోనూ, ఇతర ప్రాంతాల్లో ముస్లింలు చేపట్టిన ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తెలిపారు. పట్టణంలో సుమారు 1500 మందితో భారీ ర్యాలీ చేపట్టగా, ఎటువంటి ఘటనలు జరగకుండా తమ సిబ్బంది బందోబస్తు నిర్వహించారన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పారు.

News September 5, 2025

VZM: ఐటీఐ ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో 600/600

image

ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి ఎర్ల సాయి సత్తా చాటాడు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 600/600 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడని ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 590 ప్లస్ మార్కులను ఆరుగురు విద్యార్థులు సంపాదించారన్నారు. జూనియర్ విభాగంలో కూడా మంచి ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు.