News April 3, 2024
రూ.50కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ చోరీ!

చోరీకి వస్తువు ఏదైతే ఏంటి, బంగారంతో చేసింది అయితే చాలు అనుకున్నాడో దొంగ. ఏకంగా రూ.50కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ దొంగిలించాడు. ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హైమ్ ప్యాలెస్‌కు చెందిన ఈ 18 క్యారెట్ల గోల్డ్ కమోడ్‌ను 2019లో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచగా జేమ్స్ షీన్ చోరీ చేశాడు. తాజాగా అతను దోషిగా తేలాడు. కాగా రూ.4.19కోట్ల విలువైన వస్తువుల చోరీ కేసులో జేమ్స్ 17ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
Similar News
News November 14, 2025
హరీశ్‌కు అసూయ, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు: రేవంత్

TG: అధికారం పోయినా హరీశ్ రావుకు అసూయ, KTRకు అహంకారం తగ్గలేదని CM రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘వారిద్దరు అసూయ, అహంకారం తగ్గించుకోవాలి. అసెంబ్లీలో రక్తమంతా మొహంలోకి తెచ్చుకుని హరీశ్ చూస్తుంటాడు. ఆ చూపులకు శక్తి ఉంటే మాడి మసైపోతాం’ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, వారసత్వ సంపద కాదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు. సమస్యలపై ధర్నాలు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు.
News November 14, 2025
వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 14, 2025
‘ఫర్టిగేషన్’లో ఎరువులను ఎలా అందించాలి?

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.


