News September 6, 2025
ఖమ్మం: సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న MEO

నేలకొండపల్లి MEO బాలిన చలపతిరావు ఉత్తమ హెడ్మాస్టర్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఉపాధ్యాయ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఈఓ చలపతిరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News September 6, 2025
పాలమూరు: నేడు ZPTC, MPTC ముసాయిదా ఓటరు జాబితా

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు ZPTC, MPTC ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీలు 77 కాగా, ఎంపీటీసీలు 800 ఉన్నాయి. వీటిపై ఈనెల 8న సమావేశాలు నిర్వహిస్తారు. 9న అభ్యంతరాలను స్వీకరణ, పరిష్కారం అనంతరం 10వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రదర్శించనున్నారు.
News September 6, 2025
ఖమ్మంలో వేడుకలకు సర్వం సిద్ధం

తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు నేడు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం నగరంలో మున్నేరు వద్ద, భద్రాచలంలో గోదావరి వద్ద అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, క్రేన్లు, గజఈతగాళ్లతో పాటు భారీగా పోలీసులు మోహరించారు.
News September 6, 2025
HYD: వారేవా! బుడ్డోడు భక్తితో గణపయ్యను కట్టేశాడు

HYDలో గణేశ్ నిమజ్జనంలో 5 ఏళ్ల బాలుడు సందడి చేశాడు. చిన్న గణపయ్యను తాను ఆడుకునే బైక్‌పైనే ట్యాంక్ బండ్‌పైకి తీసుకురావడం అందరినీ ఆకట్టుకుంది. అ బాలుడి భక్తికి అక్కడికి వచ్చిన పర్యాటకులందరూ తన్మయత్వంలో మునిగారు. ‘గణపయ్యను తాళ్లతోనే కాకుండా నీ భక్తితో కట్టేశావ్.. నీకు సకల శుభాలు కలుగుగాక’ అంటూ దీవిస్తున్నారు. అతడితో ఫొటోలు దిగారు. ఈ అబ్బాయి వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.