News September 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 6, 2025

టెస్లా కారు కొన్న మంత్రి.. ‘స్వదేశీ’ ఏమైంది?

image

భారత్‌లో తొలి టెస్లా Y మోడల్ కారును మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ <<17619296>>కొనుగోలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులే ప్రధాని మాటను లెక్కచేయకపోతే ఎలా అని నిలదీస్తున్నారు. టాటా, మహీంద్రా లాంటి కంపెనీలు కనబడట్లేదా అని ఫైరవుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News September 6, 2025

SIIMA: ప్రభాస్ మూవీకి ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైఫై థ్రిల్లర్ ‘కల్కి 2898 AD’ని SIIMA బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ వరించింది. ప్రొడ్యూసర్ ప్రియాంకా దత్ పురస్కారాన్ని స్వీకరించారు. బెస్ట్ సపోర్టింగ్ రోల్(మేల్, ఫీమేల్), బెస్ట్ నెగటివ్ రోల్ అవార్డులను కూడా ఈ మూవీ సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ‘కల్కి 2898 AD’కి 4, <<17626582>>పుష్ప-2కు<<>> 4, దేవరకు 3, హనుమాన్‌, కమిటీ కుర్రోళ్లు చిత్రాలకు 2 చొప్పున అవార్డ్స్ వచ్చాయి.

News September 6, 2025

తిరుమల: దర్శనానికి 24 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలా తోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.