News September 6, 2025
సెప్టెంబర్ 6: చరిత్రలో ఈరోజు

1766: పరమాణు సిద్ధాంత ఆద్యుడు, బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ డాల్టన్ జననం(ఫొటోలో)
1892: నోబెల్ గ్రహీత సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్ జననం
1950: సుప్రసిద్ధ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం
1950: ప్రముఖ కవి, న్యాయవాది ఎన్.బాలకిషన్ రావు జననం
1949: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ జననం
2024: కవి, లిరిక్ రైటర్ వడ్డేపల్లి కృష్ణ మరణం
Similar News
News September 6, 2025
తురకపాలెం ప్రజలు వంట చేసుకోవద్దు: సీఎం

AP: గుంటూరు <<17604174>>తురకపాలెం<<>>లో వరుస మరణాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గ్రామస్థులెవరూ వంట చేసుకోవద్దని, అక్కడి తాగు నీటిని వినియోగించొద్దని సూచించారు. అక్కడి ప్రజలకు అధికారులే ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో ఇవాళ్టి నుంచే తురకపాలెం గ్రామస్థులకు మూడు పూటలా ఆహారం, మంచినీళ్లు సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైద్యులు మరణాలకు గల కారణాలు కనుగొనే పనిలో పడ్డారు.
News September 6, 2025
BREAKING: మోదీ అమెరికా పర్యటన రద్దు

న్యూయార్క్(US)లో ఈనెల 23 నుంచి 29 వరకు జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హైలెవెల్ డిబేట్‌కు PM మోదీ హాజరుకావడం లేదు. ఇటీవల విడుదల చేసిన వివిధ దేశాధినేతల స్పీచ్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 26న మోదీ UN జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాల్సి ఉంది. కానీ తాజాగా షెడ్యూల్ రివైజ్ అయింది. PM స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈనెల 27న స్పీచ్ ఇవ్వనున్నారు. పర్యటన రద్దుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 6, 2025
వెనిజులపై యుద్ధానికి సిద్ధమైన అమెరికా!

US-వెనిజుల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వెనిజుల అధ్యక్షుడు మదురోను పదవి నుంచి దించేయాలని ప్లాన్ చేస్తున్న ట్రంప్.. 10 F-35 ఫైటర్ల జెట్లను సరిహద్దుల్లో మోహరించారు. ఆ దేశంలోని డ్రగ్స్ కార్టెల్స్‌పై మిలిటరీ స్ట్రైక్స్ చేయాలని భావిస్తున్నారు. తమ దేశంలోకి <<17597311>>డ్రగ్స్<<>> వచ్చేందుకు మదురోనే కారణమని US ఆరోపిస్తోంది. అయితే వెనిజుల చమురు సంపదను దోచుకునేందుకే యూఎస్ ఈ కుట్రలకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి.