News September 6, 2025

BHPL: సన్నకారు రైతుకు యూనిట్‌కు రూ.50 వేల రాయితీ

image

భూపాలపల్లి జిల్లాలో కూరగాయలు సాగు చేసే సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వం యూనిట్‌కు రూ.50 వేల రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునీల్ తెలిపారు. టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామంలో పందిరి విధానంలో సాగు చేస్తున్న బోడకాకరను పరిశీలించారు. పందిరి సాగు విధానాలను ప్రోత్సహిస్తూ ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ, సాంకేతిక సహాయం అందుబాటులో ఉంటుందని వివరించారు.

Similar News

News September 6, 2025

తురకపాలెం ప్రజలు వంట చేసుకోవద్దు: సీఎం

image

AP: గుంటూరు <<17604174>>తురకపాలెం<<>>లో వరుస మరణాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గ్రామస్థులెవరూ వంట చేసుకోవద్దని, అక్కడి తాగు నీటిని వినియోగించొద్దని సూచించారు. అక్కడి ప్రజలకు అధికారులే ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో ఇవాళ్టి నుంచే తురకపాలెం గ్రామస్థులకు మూడు పూటలా ఆహారం, మంచినీళ్లు సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైద్యులు మరణాలకు గల కారణాలు కనుగొనే పనిలో పడ్డారు.

News September 6, 2025

NLG: రేపు నల్గొండలో బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు

image

ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 7న జిల్లాకేంద్రంలోని HYD రోడ్డు విద్యుత్ పోల్ సెంటర్ క్రీడామైదానంలో నిర్వహించనున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనిశెట్టి బయ్యన్న తెలిపారు. జనగామ జిల్లాలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించే అంతర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో ఎంపికైన క్రీడా జట్లు పాల్గొంటాయని తెలిపారు.

News September 6, 2025

చింతలపూడి: రూ.48 లక్షలతో గణేశుడి అలంకరణ

image

చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా రూ.48 లక్షల కరెన్సీ నోట్లతో వినాయక మండపాన్ని అలంకరించారు. శుక్రవారం కావడంతో లక్ష్మీ గణపతి రూపంలో రాత్రి స్వామి వారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణకు సహకరించిన గ్రామస్థులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు లక్ష్మీ అలంకరణలో ఉన్న వినాయకుడిని దర్శించుకున్నారు.