News September 6, 2025
గణపతి నిమజ్జనంలో పాల్గొన్న కలెక్టర్ సత్య శారద

వరంగల్ నగరంలోని ఉర్సు రంగసముద్రంలో నిర్వహిస్తున్న నిమజ్జన కార్యక్రమాంలో కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. నగరంలోని నిమజ్జన ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 6, 2025
ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్నా: మోదీ

మోదీ తనకు మిత్రుడని, భారత్‌తో అమెరికాకు <<17626556>>ప్రత్యేక అనుబంధం<<>> ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఇరు దేశాల బంధాలు, సెంటిమెంట్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అభినందిస్తున్నా. ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, అమెరికా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాయి’ అని మోదీ ట్వీట్ చేశారు.
News September 6, 2025
BHPL: యువకుడిని కిడ్నాప్ చేసి హత్య

యుడకుడిని కిడ్నాప్ చేసి కాళ్లు, చేతులు కట్టేసి, పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన <<17625671>>BHPL<<>> జిల్లాలో జరిగింది. పోలీసుల ప్రకారం.. BHPLకి చెందిన బాసిత్(21) మూడు రోజుల క్రితం కిడ్నాప్ ఐనట్లు తల్లి సబియా ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పలువురు తన కొడుకును హత్య చేశారని ఆరోపించింది. మేడారం సమీప అడవుల్లో మృతదేహం లభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన మెసేజ్‌ల వల్లే గొడవ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
News September 6, 2025
కుమారుడికి ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

కుమారుడికి టీచర్ ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకున్న తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్తిలి మండలం బల్లిపాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కుమారుడికి DSCలో ఉద్యోగం రాకపోవడంతో గ్రామానికి చెందిన కాకర్ల ఆదినారాయణ (65) శుక్రవారం రాత్రి తణుకులోని ఓ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.