News September 6, 2025
వరంగల్ వాసికి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ వాసికి నేషనల్ బెస్ట్ టీచర్స్ అవార్డు వరించింది. హన్మకొండ 57వ డివిజన్ గోకుల్ నగర్ వాస్తవ్యురాలు నక్క స్నేహలత యాదవ్ శుక్రవారం ఢిల్లీలో మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ & ఎంటర్ప్యనర్షిప్ గవర్నమెంట్ అఫ్ ఇండియా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆమె NAC సీనియర్ ఫాకల్టీగా పనిచేస్తున్నారు.
Similar News
News September 6, 2025
ముమ్మిడివరం: రూ.30 కోట్లతో జంప్

చిట్టీల పేరిట మురముళ్లలో రూ.30 కోట్లతో ఓ కేటుగాడు జంప్ అయ్యాడు. ఐ.పోలవరం(M) పశువుల్లంకకు చెందిన చింతలపూడి వీరా శంకరరావు మురముళ్ల కేంద్రంగా 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ నమ్మకంగా ఉండేవాడు. ఇటీవల కాకినాడలో కొన్ని ఆస్థులను కొని పరారయ్యాడు. కొద్ది రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్, ఇంటికి తాళం వేసి ఉండడంతో దాదాపు 100 మంది బాధితులు ఎమ్మెల్యే బుచ్చిబాబు, పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రవీంద్ర కేసు నమోదు చేశామన్నారు.
News September 6, 2025
భవన నిర్మాణాల అనుమతులతో GHMCకి భారీ లాభం

GHMC భవన నిర్మాణాలకు భారీగా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో 4,389 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, రూ.759.98 కోట్ల ఆదాయం గడించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చింది రూ.399.61 కోట్లు కాగా.. ఈసారి రూ.360.37 కోట్లు అదనంగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని GHMC అంచనా వేస్తోంది.
News September 6, 2025
విద్యారంగంలో సిద్దిపేటకు ఉత్తమ అవార్డు

విద్యారంగంలో ఓవరాల్‌గా ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా సిద్దిపేట ఎంపికైంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు సాధించినందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి అభినందనలు తెలిపారు.