News September 6, 2025
MBNR: రాష్ట్రంలోనే మన యూనివర్సిటీ NO:1

రాష్ట్రంలోనే పాలమూరు విశ్వవిద్యాలయం PM-ఉషా పథకం కింద రూ.100 కోట్ల గ్రాంట్ అందుకుంది. అనేక విశేష విజయాలను సాధించి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా విస్తరణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. NAAC ద్వారా గుర్తింపు పొందింది. HYDలోని శిల్పరామంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.
Similar News
News September 6, 2025
పాలమూరులో మైక్రో బ్రూవరీలకు అనుమతి

MBNR జిల్లాలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. వెయ్యి గజాల స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని, తయారైన బీర్లను అక్కడే విక్రయించాలని సూచించారు. 36 గంటల్లోగా అమ్ముడుపోని బీర్లను పారేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. అనుమతి పొందిన వారు ఆరు నెలల్లోగా యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
News September 6, 2025
రూ.లక్షకు చేరువైన 22 క్యారెట్ల బంగారం ధర

బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,08,490కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.99,450 పలుకుతోంది. మరో రెండ్రోజుల్లో చరిత్రలో తొలిసారి రూ.లక్ష క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. అటు KG వెండిపై రూ.2,000 పెరిగి ఫస్ట్ టైమ్ రూ.1,38,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 6, 2025
KNR: ‘స్థానికం’లో BRSకు కవిత ‘ఎఫెక్ట్’..!

స్థానిక ఎన్నికల సమయంలో BRSకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం CBIకి కేసు బదలాయించగా కవిత తాజా ఎపిసోడ్ BRSను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఏకంగా పార్టీలోని ముఖ్యులపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీంతో స్థానిక పోరులో BRSకు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశముందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. తద్వారా BRS నుంచి బరిలో నిలిచే ఆశావహుల్లో ఆందోళన నెలకొంది.