News September 6, 2025
MBNR: పాలమూరు వర్శిటీ..UPDATE!!

✒40,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు పట్టభద్రులు
✒గ్రీన్ ఛాంపియన్ అవార్డు
✒ఇంజనీరింగ్ కళాశాలలో 100% అడ్మిషన్లు
✒జి.మహేశ్వరి అఖిల భారత ఇంటర్ యూనివర్శిటీ అథ్లెటిక్ లో విజేత
✒రక్తదానం, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ, 2500 మందికి పైగా లబ్ధిదారులకు మేలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYDలో ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసి..CM,ఎంపీలు, ప్రొఫెసర్లు, ఇతర అతిథులకు పాలమూరు విశ్వవిద్యాలయం విజయాలను పరిచయం చేశారు.
Similar News
News September 6, 2025
HYD: వారేవా! బుడ్డోడు భక్తితో గణపయ్యను కట్టేశాడు

HYDలో గణేశ్ నిమజ్జనంలో 5 ఏళ్ల బాలుడు సందడి చేశాడు. చిన్న గణపయ్యను తాను ఆడుకునే బైక్‌పైనే ట్యాంక్ బండ్‌పైకి తీసుకురావడం అందరినీ ఆకట్టుకుంది. అ బాలుడి భక్తికి అక్కడికి వచ్చిన పర్యాటకులందరూ తన్మయత్వంలో మునిగారు. ‘గణపయ్యను తాళ్లతోనే కాకుండా నీ భక్తితో కట్టేశావ్.. నీకు సకల శుభాలు కలుగుగాక’ అంటూ దీవిస్తున్నారు. అతడితో ఫొటోలు దిగారు. ఈ అబ్బాయి వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
News September 6, 2025
దంపతుల గుండె పగిలేలా చేసిన ప్రమాదం

ఒక్కగానొక్క బిడ్డ. మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో <<17627461>>అల్లారుముద్దుగా<<>> పెంచుకున్నారు. కష్టం దరిచేరకుండా కంటికి రెప్పలా కాపాడుతుకున్నారు. కానీ విధి వారి ఆశల్ని చిధిమేసింది. సూళ్లూరుపేట(M) అబాక హరిజనవాడలో రోటవేటర్‌లో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. కృష్ణయ్య చిన్న కుమారుడు, కోడలికి దివాన్(3) ఒక్కడే బిడ్డ. ఆ పిల్లాడి మృతితో దంపతులు గుండెలు పగిలేలా విలపించారు.
News September 6, 2025
KNR: ‘రాగిజావ’ పథకం ఉన్నట్టా..? లేనట్టా..?

గ్రామీణ విద్యార్థులకు పౌష్టికాహారం అందాలనే లక్ష్యంతో రాగిజావ స్కీంను తెచ్చారు. రెండేళ్లుగా సాఫీగా సాగిన పథకం స్కూళ్లు ప్రారంభమై 3నెలలైనా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్, ప్రభుత్వం ఈ స్కీంను సాగిస్తోంది. 10గ్రా. బెల్లం, 10గ్రా. రాగిపిండితో జావ ఇచ్చేందుకు ఒక్క విద్యార్థికి 25పైసల చొప్పున ఏజెన్సీకిచ్చేవారు. కాగా, రాష్ట్రంలో ఇప్పుడీ పథకముందా, రద్దయిందా అనే సంకట స్థితి నెలకొంది.