News September 6, 2025

SIIMA: బెస్ట్ యాక్టర్స్, డైరెక్టర్ వీరే

image

* బెస్ట్ యాక్టర్(ఫీమేల్)- రష్మిక మందన్నా(పుష్ప-2)
* బెస్ట్ యాక్టర్(ఫీమేల్-క్రిటిక్స్)- మీనాక్షి(లక్కీ భాస్కర్)
* బెస్ట్ డైరెక్టర్(క్రిటిక్స్)- ప్రశాంత్ వర్మ(హనుమాన్)
* బెస్ట్ డెబ్యూటంట్ ప్రొడ్యూసర్- నిహారిక(కమిటీ కుర్రోళ్లు)
* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(మేల్)- అమితాబ్ బచ్చన్(కల్కి)
* బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్(మేల్)- కమల్ హాసన్(కల్కి)
* బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడీ రోల్- సత్య(మత్తు వదలరా 2)

Similar News

News September 6, 2025

విష్ణువు దశావతారాలు ఎందుకు ఎత్తారు? (1/2)

image

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విష్ణువు దశావతారాలు ఎత్తారు. సృష్టి ప్రళయానికి గురైనప్పుడు, వేదాలను కాపాడేందుకు మత్స్య రూపంలో వచ్చారు. క్షీరసాగర మథన సమయంలో మందరగిరిని మోయడానికి తాబేలు అవతారంలో వచ్చారు. భూమిని కాపాడేందుకు వరాహ రూపం, భక్త ప్రహ్లాదుణ్ని కాపాడి, హిరణ్యకశిపుణ్ని చంపేందుకు నరసింహుని రూపం ఎత్తారు. బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచి లోకాలను అధీనంలోకి తెచ్చుకోవడానికి వామనుడిగా వచ్చారు.

News September 6, 2025

విష్ణువు దశావతారాలు ఎందుకు ఎత్తారు? (2/2)

image

క్షత్రియ జాతిలో పెరిగిన అహంకారాన్ని అణిచివేయడానికి విష్ణువు పరశురాముని అవతారం ఎత్తారు. ధర్మాన్ని నిలబెట్టడానికి, రావణుణ్ని సంహరించి ధర్మ స్థాపన చేయడానికి రామునిగా వచ్చారు. దుష్టులను శిక్షించడానికి, మహాభారత యుద్ధంలో ధర్మాన్ని రక్షించడానికి కృష్ణునిగా వచ్చారు. శాంతి సందేశాన్ని ప్రచారం చేయడానికి బుద్ధుని అవతారం ఎత్తారు. కలియుగం అంతంలో ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కి రూపంలో అవతరిస్తారని నమ్మకం.

News September 6, 2025

నేడు ఈ వ్రతం చేస్తే సకల శుభాలు

image

కష్టాల నుంచి విముక్తి పొంది సకల శుభాలు కలగాలంటే నేడు అనంత పద్మనాభ వ్రతం చేయాలని పండితులు చెబుతున్నారు. భాద్రపద శుద్ధ చతుర్దశినాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పుణ్య ఫలాలు లభిస్తాయని అంటున్నారు. ‘శ్రీకృష్ణుడే స్వయంగా ఈ వ్రతం గురించి పాండవులకు చెప్పారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు కలుగుతాయి. ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించి, అనంత పద్మనాభుని కృపకు పాత్రులైతే అంతర్గత శాంతి లభిస్తుంది’ అని సూచిస్తున్నారు.